Bomb Threat on Iran Flight: ఇరాన్‌కు చెందిన ఓ విమానం భారత్ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. మహాన్ ఎయిర్ విమానం ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళుతోంది. ఆ సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది.
అప్రమత్తం
ఈ సమాచారం అందిన వెంటనే భారత వాయుసేన అప్రమత్తమైంది. అధికారులు వెంటనే దిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్ చేశారు. ఆ విమానంలోని ఫైలెట్‌కి జైపుర్ లేదా చండీగఢ్‌లలో ల్యాండ్ అయ్యేలా రెండు ఆప్షన్‌లు కూడా ఇచ్చారు. అయితే పైలెట్ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది.
నాన్‌స్టాప్
బాంబు బెదిరింపుతో పైలట్ కంగారు పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ పైలెట్ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ రంగంలోకి దిగి పైలెట్‌ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్ చైనాలోని తన గమ్యస్థానానికి విమానాన్ని వేగంగా పోనిచ్చాడు. ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది.
సేఫ్ ల్యాండింగ్
మొత్తానికి ఈ విమానాన్ని పైలట్.. గమ్యస్థానమైన చైనాలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయం అధికారులు ఫ్లెయిట్‌లో ఉన్న ప్రయాణికులను బయటకు దించి.. తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేసింది. ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించకపోయేసరికి.. అది ఫేక్ కాల్‌గా అధికారులు నిర్ధరించారు.
Also Read: Dengue Cases In Delhi: దిల్లీలో డెంగ్యూ దడ- వారంలో 400 కొత్త కేసులు నమోదు!
Also Read: Uttar Pradesh: డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పై కుప్పకూలిన వ్యక్తి- వీడియో వైరల్!