Solar Industry Blast:


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 9.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు పదార్థాలు ప్యాకింగ్ చేసే సమయంలో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో పాటు రక్షణశాఖకు కీలక పరికరాలు సప్లై చేస్తోంది ఈ కంపెనీ. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది కార్మికులున్నారు. నవంబర్ 29న గుజరాత్‌లోని సూరత్‌లో కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున ప్లాంట్‌లో నిల్వ ఉంచడం వల్లే పేలుడు జరిగిందని పోలీసులు వెల్లడించారు. ట్యాంక్‌లో నిల్వ ఉంచారని, అందులో నుంచి గ్యాస్ లీక్ అయిందని వివరించారు. 






ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా దురదృష్టకరమైన ఘటన అంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.


"నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో జరిగిన పేలుడులో 9 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. డిఫెన్స్ ఫోర్సెస్ కోసం ఈ కంపెనీ డ్రోన్స్, పేలుడు పదార్థాలు తయారు చేస్తోంది. పోలీసు అధికారులంతా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తాం"


- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం


నవంబర్ 29న గుజరాత్‌లోని సూరత్‌లో కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున ప్లాంట్‌లో నిల్వ ఉంచడం వల్లే పేలుడు జరిగిందని పోలీసులు వెల్లడించారు. ట్యాంక్‌లో నిల్వ ఉంచారని, అందులో నుంచి గ్యాస్ లీక్ అయిందని వివరించారు. 


Also Read: Indian Student Missing: యూకేలో భారతీయ విద్యార్థి అదృశ్యం,జైశంకర్ సాయం కోరిన బీజేపీ నేత