MLC Madhav: గత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలన్నింటిని వందశాతం పూర్తి చేశానని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తరాంద్ర ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీనే గెలుచుకుంటూ వస్తుందని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాలు మేరకు మరోసారి ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ కార్యాలయానికి వెల్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ, దక్షిణాధి రాష్ట్రాల పార్లమెంట్ చీఫ్ విప్ జీవీఎల్ నరసింహ రావు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన పార్టీతో కలసి ముందుకు వెళ్తన్నట్లు మాధవ్ స్పష్టం చేశారు. ఉత్తరాంద్ర పట్టభద్రులు తమ ప్రాధాన్యతా ఓటును బీజేపీకే వేయవాల్సిందిగా కోరారు. ఉత్తరాంద్రలో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన గుర్తు చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పెట్టుకున్న ఆశయాలను 100 శాతం పూర్తి చేశామన్నారు. 






విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను సాధించుకున్నామమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వివరించారు. ఉత్తరాంద్రలో ఉన్న 34 నియోజకవర్గాలలో జాతీయ రహదారులను నిర్మించామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ ప్రకటన వచ్చిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి సెయిల్ లో కలపమని కోరినట్లు వెల్లడించారు. విశాఖలో ఉన్న పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. విశాఖ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్నమని ప్రకటించారు. ఉత్తరాంద్ర ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరం లో కీలక పాత్ర పోషిస్తున్న తమను ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించాలని కోరారు. 


నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్తున్న వైసీపీ అభ్యర్థి..!






మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రానున్న ఏ ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్సీపీ విజయానికి దోహదపడతాయని వైసిపి ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టబద్ర నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్న దొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మేయర్ హరి వెంకట కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సుబ్బారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా ఓటు వేసి ఆ అభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరారు.


అంతకుముందు బీచ్ రోడ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయం చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.