BJP Complaint on Sonia Gandhi: 



ఆ కామెంట్స్‌తో అలజడి 


కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సోనియా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి కంప్లెయింట్ ఇచ్చింది. కాంగ్రెస్ గుర్తింపుని రద్దు చేయాలని కోరారు. హుబ్బళిలో ప్రసంగించే సమయంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మర్యాదను మంటగలిపే వాళ్లను ఎప్పటికీ సహించబోమని బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇదే సమయంలో కర్ణాటక సమగ్రతను, ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తే ఊరుకునేదే లేదని అన్నారు. ఈ కామెంట్స్‌పైనే బీజేపీ మండి పడుతోంది. కావాలనే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సోనియా గాంధీపై FIR నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అఫీషియల్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసిన ట్వీట్‌ ఇమేజ్‌ని ఈ కంప్లెయింట్‌తో పాటు జత చేసింది. 6.5 కోట్ల కర్ణాటక ప్రజలకు సోనియా గాంధీ తప్పుడు సందేశమిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది బీజేపీ. "సార్వభౌమాధికారానికి నిర్వచనం మన స్వతంత్ర భారత దేశం. భారత్‌ సార్వభౌమ దేశం. కర్ణాటక కూడా అందులో భాగమే. అందుకు మేం గర్వ పడుతున్నాం" అని కంప్లెయింట్‌లో ప్రస్తావించింది. కర్ణాటకను వేరు చేసి మాట్లాడటం సరికాదని కాంగ్రెస్‌కు హెచ్చరికలు చేసింది. కేంద్రమంత్రి శోభా కరంద్లజే ఈ కంప్లెయింట్ ఇచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ (Model Code of Conduct)ని సోనియా ఉల్లంఘించారని, కచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. 






"సోనియా గాంధీ మాటల్ని బట్టి చూస్తే కర్ణాటక భారత్‌లో భాగమే కాదన్నట్టుగా ఉంది. ఇలాంటి కామెంట్స్‌తో ప్రజల్లో విద్వేషాలు రెచ్చ గొడుతోంది. అనవసరమైన ఆందోళనలకు తావిస్తోంది. కర్ణాటక భారత్‌లో భాగమే. సోనియా చేసిన వ్యాఖ్యలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి"


- బీజేపీ 






బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, అనిల్ బలుని, తరుణ్‌ చుగ్‌ ఎన్నికల సంఘానికి వెళ్లారు. యాంటీ నేషనల్ యాక్ట్ కింద సోనియాపై కేసు నమోదు చేయాలని కోరారు. 


"కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తేనే అర్థమవుతోంది ప్రజల్ని విడగొట్టాలని కుట్ర చేస్తున్నారని. అలాంటి కుట్రదారులందరికీ లీడర్ సోనియా గాంధీ. అందుకే అలాంటి భాష వాడుతున్నారు. ఆమెపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాం"


- కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ 


Also Read: The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి - జేపీ నడ్డా రివ్యూ