ABP  WhatsApp

Bihar News: ఘోర ప్రమాదం- బాణసంచా పేలి ఆరుగురు మృతి!

ABP Desam Updated at: 24 Jul 2022 08:37 PM (IST)
Edited By: Murali Krishna

Bihar News: బిహార్‌లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తోన్న ఓ భవనంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

(Image Source: PTI)

NEXT PREV

Bihar News: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.






ఇదీ జరిగింది


సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. షబీర్ హుస్సేన్ అనే  బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. గంట సేపు వరకూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. మూడంతస్తుల భవంతిలో ఒక పోర్షన్‌లో అక్రమంగా బాణసంచా తయారీ జరుగుతోందని స్థానికులు తెలిపారు.





భారీ పేలుడు జరగడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగి భవనం చాలా భాగం కుప్పకూలిందని పోలీసు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి వెలికి తీసేందుకు చర్యలు చేపడుతున్నారు.



కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్​ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆరు అంబులెన్సులు, సహాయక బృందాలను మోహరించాం.                                                      - సంతోష్ కుమార్, సారణ్ డివిజన్ ఎస్పీ 


పేలుడు ధాటికి


పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భవంతి నామరూపాలు లేకుండా మారిపోయింది. శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పై కప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయాయి. మృతుల శరీర బాగాలు 50 మీటర్ల దూరంలో కనిపించాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందోనని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు గంటపాటు పేలుడు జరిగినట్లు సాక్షులు తెలిపారు.


Also Read: Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథుని సన్నిధిలో భక్తులు, సిబ్బంది మధ్య కొట్లాట- వీడియో వైరల్!


Also Read: Viral News: బార్‌లో రెచ్చిపోయిన మహిళలు- చావగొట్టి, చెవులు మూశేశారు!

Published at: 24 Jul 2022 08:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.