Sardar of Thieves: బిహార్‌కు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన శాఖలో ఎంతోమంది దొంగలున్నారని, వారందరికీ తానే సర్దార్‌ను అంటూ మంత్రి సుధాకర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బిహార్‌లో రాజకీయ దుమారం రేగింది.
ఇలా అన్నారు
బిహార్ విత్తన సంఘంలో జరుగుతోన్న అవినీతిని ప్రస్తావిస్తూ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సుధాకర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్పిన ఆ సంఘం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
అవును అన్నాను
ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు ఫైర్ అయ్యారు. సుధాకర్ సింగ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం నితీశ్ కుమార్‌ను డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా మంత్రి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
గతంలో
ఈ వ్యాఖ్యలతో జేడీయూ- ఆర్‌జేడీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. బిహార్‌లో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ ఇటీవలే భాజపాతో బంధం తెంచుకొని ఆర్‌జేడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే 2013లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సుధాకర్ సింగ్‌పై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలున్నాయి.
Also Read: Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా మరోసారి ముకుల్ రోహత్గి!
Also Read: Kerala: ఓరి దేవుడా! అవి కుక్కలా లేక పులులా? కుర్రాళ్ల టైం బావుంది!