గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్షం ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.
ఎవరీ భూపేంద్ర పటేల్..
- భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
- ఆ నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి రికార్డ్ స్థాయిలో 1,17,000 తేడాతో గెలుపొందారు.
- ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో ఇదే అత్యధిక మెజారిటీ.
- గుజరాత్ మాజీ సీఎం, యూపీ గవర్నర్ ఆనందీబెన్ కు భూపేంద్ర పటేల్ సన్నిహితుడు.
- గతంలో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గానూ పటేల్ బాధ్యతలు నిర్వర్తించారు.
విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు రూపానీ. ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే రాజీనామాకు గల కారణాలను రూపానీ వెల్లడించలేదు. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ఇది సూదీర్ఘ సమయమని ఆయన అన్నారు. సీఎం మార్పు అనేది భాజపాలో సర్వ సాధారణమన్నారు. మునుపటిలానే అధిష్ఠానం కింద పార్టీ కోసం కృషి చేస్తానన్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త ఫేస్ తో వెళ్లాలని భాజపా వ్యూహాలు రచించింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రిని మార్పు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్, కర్ణాటకలలో కూడా భాజపా సీఎంలను మార్పు చేసింది.
Also Read:Centre on Covid19: 'అవన్నీ కొవిడ్ మరణాలు కాదు..' కేంద్రం కొత్త గైడ్ లైన్స్ తెలుసా?