బాస్ జూమ్ మీటింగ్ పెట్టాడు..! అసలే క్రిస్మిస్ సందండి.. పైగా హుషారైన బాస్.. ఎంత బోనస్ ఇస్తాడో.. ఎన్ని రోజులు సెలవులు ఇస్తారో అనే ప్రకటన కోసం ఎగ్జైటింగ్‌గా అందరూ మీటింగ్‌కు హాజరయ్యారు. కానీ మీటింగ్ ముగిసే సరికి అందరికీ చెమటలు పెట్టేశాయి. మెయిల్ వచ్చిన నోటిఫికేషన్ వస్తుందేమోనని ఊపిరి బిగపట్టుకుని కూర్చుకున్నారు. మెయిల్ రావొద్దని దేవుడికి మొక్కుకున్నారు. ఎందుకంటే జూమ్ మీటింగ్‌లో బాస్ సెలవులు ఇస్తాడనుకుంటే శాశ్వతంగా ఉద్యోగానికే సెలవు ప్రకటించేశాడు. అయితే అందరికీ కాదు.. కంపెనీలో పని చేస్తున్న 900 మందికి. వారెవరో అనేది మెయిల్స్ వస్తాయని చెప్పారు. అంతే ఆ ఉద్యోగుల గుండెల్లో రాయి పడింది.
Also Read : 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
అమెరికాలో బెట్టర్ డాట్ కామ్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. మంచి పనితీరుతో లాభాలు కూడా సంపాదిస్తూ ఉంటుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ . ఆయన ఫోర్బ్స్ లిస్ట్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. అందుకే.. ఉద్యోగులు తమకేదో ప్రోత్సాహం ఇస్తారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశాడు. ఈ సంస్థకూ ఇండియాలోనూ ఉద్యోగులున్నారు. వారికీ కూడా బ్యాడ్ న్యూస్ అందినట్లుగా తెలుస్తోంది.
Also Read : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?
ప్రస్తుతం ప్రపంచంలో మార్కెట్ మారిందని . కంపెనీలు దానికి అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని అందుకే కీలకమైన నిర్ణయం తీసుకున్నానన్నారు. అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తోంది. మీరు ఆ జాబితాలో ఉంటే చాలా దురదృష్టవంతులు. ఈ నిర్ణయం అన్నీ స్థాయిలలోని ఉద్యోగులకు వర్తిస్తుంది. అలాగే, ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ఎవరి ఉద్యోగం పోయింది అనేది కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ-మెయిల్ వస్తుందని అని ప్రకటించి వెళ్లిపోయారు.
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
అంతే ఉద్యోగులందరికీ టెన్షన్ పట్టుకుంది. అన్నట్లుగానే 900 మందికి ఊస్టింగ్ లెటర్స్ పంపించారు. ఉద్యోగం పోయిన వారికి 4 వారాల వేతనం ఇస్తారు. అయితే విశాల్ గార్గ్ ఇలా మూకుమ్మడిగా ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ో సారి అలాగే చేశారు. పనితీరు ఆధారంగానే తీసేసినట్లుగా తెలుస్తోంది. ఈ జూమ్ వీడియో మీటింగ్‌ను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.
Also Read: Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి