Bengaluru Techie Works in Theatre:
వర్క్ ఫ్రమ్ థియేటర్
కరోనా ప్యాండెమిక్‌తో మన లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకూ చాలా నార్మల్‌గా గడుపుతున్న మనల్నందరినీ అలెర్ట్ చేసింది ఈ వైరస్. వర్క్ కల్చర్ కూడా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ట్రెండ్ వచ్చేసింది. కరోనా పరిస్థితులు కుదుట పడిన తరవాత కూడా చాలా కంపెనీలు WFHని కంటిన్యూ చేస్తున్నాయి. మరి కొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడ్‌లో నడుస్తున్నాయి. అయితే...ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌పై బోలెడన్ని జోక్స్, మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వింత వింత ప్లేస్‌లలో కూర్చుని ల్యాప్‌టాప్ పట్టుకుని పనులు చేసుకుంటున్న వీడియోలు వెరల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే మరోటి వైరల్ అవుతోంది. బెంగళూరులోని ఓ ఐటీ ఎంప్లాయ్ థియేటర్‌లో కూర్చున్నాడు. ఉన్నట్టుండి బ్యాగ్‌లో నుంచి ల్యాప్‌టాప్ తీసి పని చేయడం మొదలు పెట్టారు. వెనకనున్న వాళ్లు ఇది చూసి అవాక్కయ్యారు.
వైరల్ అవుతున్న వీడియో
సినిమా హాల్‌లో వర్క్ ఏంటి బాబు అని తలపట్టుకున్నారు. వెంటనే ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వీడియోలు కనిపిస్తే నెటిజన్లు ఊరుకుంటారా..? షేర్‌లు, లైక్‌లు, కామెంట్‌లతో వైరల్ చేసేశారు. "సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. టైమ్ వేస్ట్ ఎందుకని పని చేసుకుంటున్నా" అని చెప్పాడట ఆ ఎంప్లాయ్. సినిమా స్టార్ట్ అయ్యాక కూడా కాసేపు ఇలానే పని చేసుకున్నాడట. "మరీ ఇంత డెడికేషనా" అంటూ ఆ పోస్ట్‌ని తెగ షేర్చేస్తున్నారు నెటిజన్లు. 50 వేల లైక్‌లు కూడా వచ్చేశాయి. "అలా పర్మిషన్ లేకుండా వీడియో ఎలా తీస్తారు" అని కొందరు కామెంట్ చేస్తుంటే..."బెంగళూరులో ఏంటి. నేనెప్పుడో కేరళకు వెళ్లాను ఇలాగే చేశాను" అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
మరో వీడియో..
కనీసం తినడానికి కూడా లేవకుండా పని చేస్తూనే ఉండే ఉద్యోగులను మీరు చూసి ఉంటారు. కానీ పెళ్లి పీటలపై కూర్చొని కూడా పని చేసే ఉద్యోగిని ఎప్పుడైనా చూశారా? ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ గతేడాది నవంబర్‌లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇందులో ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతూ, పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తూ ఉన్నాడు. కానీ పెళ్లి పీటల మీద ఉన్న వరుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా పని చేసుకుంటున్నాడు. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఎక్కువగా కోల్‌కతాకు చెందిన అకౌంట్ల నుంచి ఈ పోస్ట్ వచ్చింది. ఏది ఏమైనా ఈ పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్‌ను ఈ పెళ్లికొడుకు మరోస్థాయికి తీసుకెళ్లాడంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.