Bengaluru CEO Sparks Controversy Over ‘Brahmin Genes’ Post :  సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు అయిన పెట్టవచ్చు. ఒక్క మాటతో మంటలు కూడా రేపవచ్చు. ఈ విషయాన్ని అనురాధ తివారి అనే యువతి మరోసారి నిరూపించారు. బెంగళూరులో నివసించే ఆమె ఉదయమే జాగింగ్‌కో.. వాకింగ్‌కో వెళ్లారు. వచ్చేటప్పుడు ఓ కొబ్బరి బొండాం తాగాలనుకున్నారు. తాగుతూ ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోలో తన చేతి కండరాలు గట్టిగా ఉన్నట్లుగా .. తనకు తాను గొప్పగా అనుకోవడంతో ట్విట్టర్ లో పోస్టు చే్శారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ ఆమె దానికి క్యాప్షన్ గా .. బ్రాహ్మిన్ జీన్స్ అని పెట్టారు. ఇది చాలు కదా సోషల్ మీడియాలో మంటలు రేపడానికి.  



అనూరాధ తివారి బెంగళూరులో ఓ కంటెంట్ రైటింగ్ స్టార్టప్ కు సీఈవోగా ఉన్నారు. టెడ్ ఎక్స్ స్పీకర్ కూడా. అనూరాధ తివారి ఇలా పోస్టు పెట్టిన వెంటనే వైరల్ అయిపోయింది. పెద్ద ఎత్తున ఆమెది కుల అహంకారమన్న విమర్శలు చేస్తున్నారు.  



 





 అయితే అనూరాధ తివారి మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడరు. తాను అగ్రకులం అన్న కారణంగా అత్యధిక మార్కులు తెచ్చుకున్న తనకు సీటు రాలేదని..కానీ అరవై  శాతం మార్కులు తెచ్చుకున్న వారికి సీట్లు వచ్చాయని ఆమె వాదించేవారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు వ్యతే రికంగా మాట్లాడుతూనే ఉంటారు. తన పోస్టు వైరల్ గా మారిందని తనపై గట్టి విమర్శలు వస్తున్నాయని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు.