Bengaluru CEO Reinforces Brahmin Genes Stance With Car Sticker :  ఆగస్టులో  బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో తన కండల ప్రదర్శన చేశారు. ఆ ఫోటో తీసి దానికి క్యాప్షన్ బ్రాహ్మిణ్ జీన్స్ అని పెట్టారు. అనూరాధ తివారి బెంగళూరులో ఓ కంటెంట్ రైటింగ్ స్టార్టప్ కు సీఈవోగా ఉన్నారు. టెడ్ ఎక్స్ స్పీకర్ కూడా. అనూరాధ తివారి ఇలా పోస్టు పెట్టిన వెంటనే వైరల్ అయిపోయింది.    



 ఆమెది కుల అహంకారమన్న విమర్శలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చాయి.  తనపై వస్తున్న కామెంట్లను ఆమె ధీటుగా  ఎదుర్కొన్నారు. అందరూ ఎవరి కులాలు, మతాల గురించి వారు చెప్పుకుంటారు. కానీ బ్రాహ్మిన్స్ మత్రం చెప్పుకుంటే కుల అహంకారమా అని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. హిందూయిజానికి టార్చ్ బేరర్ బ్రాహ్మిన్స్ అని పోస్టు పెట్టారు.  



అనూరాధ తివారి మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడరు. తాను అగ్రకులం అన్న కారణంగా అత్యధిక మార్కులు తెచ్చుకున్న తనకు సీటు రాలేదని..కానీ అరవై  శాతం మార్కులు తెచ్చుకున్న వారికి సీట్లు వచ్చాయని ఆమె వాదించేవారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు వ్యతే రికంగా మాట్లాడుతూనే ఉంటారు.  తాజాగా ఆమె పెట్టిన పోస్టుపై అనుకూలంగా వ్యతిరేకంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.                                          





వెరొకరి కులాన్ని కించ పర్చనంత వరకూ ఆమె అభిప్రాయాల్ని  గౌరవించవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.