Bengalore From techie to begging on the streets: జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్. ఓ సంస్థలో ఉన్నత ఉద్యోగి. సమావేశాల్లో హుషారుగా మాట్లాడుతూ కంపెనీ అభివృద్ధికి మంచి ప్రణాళికలు వివరిస్తూ హై ప్రోఫైల్ లైఫ్ ను అనందిస్తూ ఉంటారు..
కర్ణాటక రాజధాని బెంగళూరు. ఎలక్ట్రానిక్ సిటీలో ఓ వ్యక్తి మంచి పోష్ ఇంగ్లిష్ మాట్లాడుతూ రోడ్డు మీద ఉండే వారిని పదో పరకో అడుక్కుంటూ ఉంటారు. ఆ వ్యక్తిని చూసి ఎవరూ బిచ్చగాడు అనుకోరు.కానీ చాలా మంది మనకెందుకు అని అడిగింది ఇచ్చి వెళ్తూంటారు.
అక్కడ జర్మనీలో ఉన్నది..ఇక్కడ బెంగళూరులో ఉన్నది ఒక్కరే. ఆయన పేరేమిటో తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆయనతో మాట్లాడి ఆ వీడియోను ఇన్ స్టాలో పెట్టాడు.
ఇన్‌స్టా వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతోంది పిచ్చి మాటలు కాదు. ఫిలాసఫీ దగ్గర నుంచి చాలా విషయాలు మాట్లాడుతున్నరాు.కానీ అవి సామాన్యులకు అర్థం కావు.అయితే ఆయన మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఆయన మొదట తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. తర్వాత అల్కహాల్‌కు బానిస అయ్యారు. కొన్నాళ్లకు భార్య కూడా గుడ్ బై చెప్పేసింది. దాంతో మరింత డిప్రెషన్‌కు గురయ్యాడు.ఇలా మెంటల్ గా దెబ్బతిని రోడ్ల పాలయ్యాడు.
సోషల్ మీడియాలో ఇతని వీడియో వైరల్ అవుతోంది. ఎవరైనా ఇతనికి సాయం చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఏదైనా ఓ ప్రత్యేక ఏర్పాటు చేయాలని.. బిజీ లైఫ్‌లో తగులుగుతున్న ఎదురు దెబ్బలతో ఇలా చాలా మంది మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని అంటున్నారు.
Alos Read: అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !