ABP  WhatsApp

Tamil Nadu Bear Attack: బైకర్‌పై ఎలుగుబంటి దాడి- తల కొరికేసింది, వైరల్ వీడియో!

ABP Desam Updated at: 07 Nov 2022 11:08 AM (IST)
Edited By: Murali Krishna

Tamil Nadu Bear Attack: తమిళనాడులో ఎలుగుబంటి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.

(Image Source: Twitter)

NEXT PREV

Tamil Nadu Bear Attack: తమిళనాడులోని అటవీ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ముగ్గురిపై దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.


ఇదీ జరిగింది


తెన్‌కాసి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మొదటగా ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి అనే వ్యక్తి శివసైలం నుంచి పెతన్‌పిళ్లై గ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబండి ఒక్కసారిగా అతడిపైకి దూకిి దాడి చేసింది. దీంతో వైకుంఠమణి బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. అతనిపై కూర్చున్న బల్లూకం తలను కొరకడం ప్రారంభించింది.






ఇది గమనించిన స్థానికులు ఎలుగుపై రాళ్లు విసిరారు. దీంతో ఆగ్రహించిన ఎలుగుబంటి వారిపై కూడా దాడికి దిగింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. ఎలుగుబంటిని భయపెట్టే ప్రయత్నంలో చుట్టుపక్కల ప్రజలు గట్టిగా అరిచారు. అయినా సరే బల్లూకం వైకుంఠమణి ముఖం, తలపై క్రూరంగా దాడిచేసింది.


వైరల్


క్రమంగా జనాలు గుమికూడటంతో భయంతో అక్కడి నుంచి ఎలుగుబంటి అడవిలోకి పరుగులు తీసింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడి చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన ఎలుగుబంటిని అధికారులు పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు కనిపించడం, గొర్రెలపై దాడి చేయడం సర్వసాధారణమే. అయితే మనుషులపై దాడి చేయడం ఇదే తొలిసారి                                          -   పోలీసులు


Also Read: Indian Railway: మహిళా ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్, ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రి

Published at: 07 Nov 2022 11:08 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.