Bajaj Pulsar N160 Updated Version Launched in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లోకి అప్‌డేటెడ్ పల్సర్ ఎన్160 మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త వేరియంట్ ధరను రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ట్రిమ్‌లో రైడర్లకు మెరుగైన బ్యాలెన్స్, కంట్రోల్ అందించడానికి సరికొత్త టెక్నాలజీ ఫీచర్లను యాడ్ చేశారు. బడ్జెట్ రేంజ్ లో స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. బజాజ్ కంపెనీ ఈ సిరీస్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫీచర్లను జోడించడం విశేషం.

Continues below advertisement

Read Also: Summer Car Care Tips: ఎండల్లో మీ కారు ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఉండాలా? నిపుణులు చెబుతున్న ఐదు టిప్స్ పాటించండి! 

గోల్డ్ కలర్ యూఎస్‌డీ ఫోర్క్స్..

ఈ కొత్త వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ ఫ్రంట్ భాగంలో ఇచ్చిన గోల్డ్ కలర్ అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్. ఇది బైక్‌కు ప్రీమియం లుక్ ఇవ్వడమే కాకుండా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ను మరింత స్మూత్‌గా మారుస్తుంది. ఈ పర్టిక్యులర్ వేరియంట్ సింగిల్-ఛానల్ ఏబీఎస్ (ABS), కంఫర్టబుల్ సింగిల్-సీట్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. విభిన్న రోడ్ కండిషన్స్ కు తగినట్లుగా ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టైలిష్ డిజైన్ తో పాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ లాంటి మోడర్న్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Continues below advertisement

Read Also: Honda Activa e vs TVS iQube: యాక్టివా ఇ స్కూటర్‌ వర్సెస్‌ టీవీఎస్‌ ఐక్యూబ్, ధర,మైలేజీలో ఏద బెస్ట్? పూర్తి పోలిక ఇక్కడ!

పవర్‌ఫుల్ ఇంజిన్ కెపాసిటీ.. 

ఈ సరికొత్త అప్‌డేట్‌లో మెకానికల్ పరంగా ఎలాంటి చేంజ్స్ చేయలేదు. ఈ బైక్ మునుపటి లాగే పవర్‌ఫుల్ 164.82 సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 15.7 బీహెచ్‌పీ పవర్, 14.65 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. మెరుగైన గ్రిప్ కోసం ఈ బైక్‌కు 17-ఇంచుల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ కోసం ఫ్రంట్, రియర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ అమర్చారు. కన్సోల్ విషయానికి వస్తే అవసరమైన రైడ్ ఇన్ఫర్మేషన్‌ను డిస్‌ప్లే చేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీని హయ్యర్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది.

కలర్ ఆప్షన్లు.. మార్కెట్ లో గట్టి పోటీ

ఈ అప్‌డేటెడ్ మోటార్‌సైకిల్ పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే, బ్రూక్లిన్ బ్లాక్ లాంటి నాలుగు ఆకర్షణీయమైన కలర్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పల్సర్ ఎన్160 బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మార్కెట్లో ఈ 160 సీసీ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ బడ్జెట్ లో అడ్వాన్స్‌డ్ ఫోర్క్స్, రైడింగ్ మోడ్స్ ఫీచర్లు కావాలనుకునే బైక్ లవర్స్‌కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.