Honda Activa e vs TVS iQube: భారత్‌లో పెట్రోల్ ధరలు పెరుగుదలకు తోడు పర్యావరణ స్పృహ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ఇష్టైన బ్రాండ్‌ హోండా తన ఐకానిక్ యాక్టివాను ఎలక్ట్రిక్‌ రూపంలో ప్రవేశపెట్టగా, టీవీస్ తన ఐక్యూబ్‌తో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన ముద్ర వేసుకుంది. ఈ రెండు ఫ్యామిలీ ఈవీ స్కూటర్‌లో ఏది మెరుగైనదో వివరంగా చూద్దాం. 

Continues below advertisement

ఏది చౌక? హోండా యాక్టివా ఇ vs ఐక్యూబ్‌ ధరలు

బడ్జెట్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్‌ కొంత తక్కువ ధరకే లభిస్తోంది.  టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధ 1, 15, 322 కాగా, ఆన్‌ రోడ్ ధర లక్షా పాతిక వేలుకుపైమాటే. హోండా యాక్టివా ఇ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు 1,18,147 రూపాయలు. దీని ఆన్‌రోడ్ ధర లక్షా 30 వరకు ఉంది. ఆరంభంలో కొంచెం పొదుపును ఆశించే వారికి ఐక్యూబ్ కాస్త ఆకర్షణీయమైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. 

Continues below advertisement

ఒకే క్లిక్‌లో పూర్తి పోలిక 

ఫీచర్లు / స్పెసిఫికేషన్స్హోండా యాక్టివా ఇ (Honda Activa e)టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

రియల్ వరల్డ్ రేంజ్ (Range)

102 కిలోమీటర్లు (ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే)94 కిలోమీటర్లు (ఒక్క ఛార్జ్‌పై)

గరిష్ట వేగం (Top Speed)

80 కిలోమీటర్‌లు /గంట75-78 కిమీ/గంట

మోటార్ పవర్ (Peak Power)

6 kW (శక్తివంతమైనది)4.4 kW

బ్యాటరీ టైప్ (Battery Type)

స్వ్యాప్పబుల్ (మార్చుకోగలిగేది)ఫిక్స్‌డ్ బ్యాటరీ

డిక్కీ స్పేస్ (Storage)

చాలా తక్కువ (సీటు కింద బ్యాటరీ వల్ల)30 - 32 లీటర్లు (ఎక్కువ స్టోరేజ్)

డిస్‌ప్లే స్క్రీన్ (Display)

7-అంగుళాల పెద్ద TFT స్క్రీన్స్మార్ట్ డిజిటల్ డిస్‌ప్లే

బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ

ఈ రెండు స్కూటర్ల మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం బ్యాటరీ సెటప్‌లోనే ఉంది. 

హోండాయ యాక్టివా ఇ ఇన్నోవేషన్ :- ఇందులో హోండా ప్రవేశపెట్టిన స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీ ఉంది. అంటే గంటల తరబడి ఛార్జింగ్ కోసం వేచి చూడాల్సిన పని లేదు. బ్యాటరీ స్టేషన్‌లోకి వెళ్లి ఖాళీ బ్యాటరీ ఇచ్చి, ఫుల్ ఛార్జ్ ఉన్న బ్యాటరీ కేవలం నిమిషాల్లో మార్చుకుని వెళ్లిపోవచ్చు. అయితే రెండు బ్యాటరీలను సీటు కింద ఉంచడం వల్ల యాక్టివా ఇలో డిక్కీ స్పేస్‌ దాదాపు ఉండదు. 

టీవీఎస్‌ ఐక్యూబ్ కంఫర్ట్‌:- ఇందులో ఫిక్స్డ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇంటి వద్దే ఛార్జ్ చేసుకోవాలి. కానీ, దీని వల్ల ఇందులో 30 నుంచి 32 లీటర్ల పెద్ద స్టోరేజ్‌ స్పేస్ లభిస్తుంది. నిత్యావరస వస్తువులు లేదా, హెల్మెట్ పెట్టుకోవడానికి ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్‌లా ఉపయోగపడుతుంది. 

టెక్నాలజీ పరంగా రెండు దేనికదే సాటి. యాక్టివా ఇ స్కూటర్‌లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ చేసే ఏడు అంగుళాల పెద్ద టీఎఫ్‌టీ స్క్రీన్, స్మార్ట్ కీ, రైడింగా మోడ్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఐక్యూబ్‌లో క్రాష్‌ అండ్ ఫాలో అలర్ట్, బ్లూటూత్‌ కనెక్టవిటీ, రివర్స్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ లేదా వెనుక ఒకరిని కూర్చోబెట్టుకొని ప్రయాణించినా దీని రైడ్ క్వాలిటీ స్మూత్‌గా ఉంటుంది. 

మీరు ప్రతి రోజూ ఆఫీస్‌కు లేదా వేర్వేరు పనులపై ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే, ఎక్కువ పవర్ కావాలనుకుంటే, ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతే యాక్టివా ఇ స్కూటర్‌ మంచి ఆప్షన్ అవుతుంది. 

మీరు కంప్లీట్ ఫ్యామిలీ కోసం, కూరగాయలు, లేదా సామాగ్రి పెట్టుకోవడానికి ఎక్కువ డిక్కీ స్పేస్ కావాలనుకుంటే టీవీఎస్‌ ఐక్యూబ్‌ మంచి ఎంపిక.