పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కార్ల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొత్త కారు అయినా, పాత కారు అయినా ఎండా కాలంలో సరైన మెయింటెనెన్స్‌ లేకపోతే భారీగా రిపేర్‌ ఖర్చులు తప్పవు. అందుకే వాహనదారులు తమ ప్రాణాలను , డబ్బును కాపాడుకోవడానికి ఈ కింది ఐదు ముఖ్యమైన విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. 

Continues below advertisement

సరైన ఇంజిన్ ఆయిల్‌ అవసరం 

చాలా మంది ఇంజిన్ ఆయిల్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ వేసవిలో మాత్రం ఇంజిన్ ఆయిల్ పాత్ర చాలా కీలకమైంది. ఇది కేవలం లూబ్రికేషన్ మాత్రమే కాకుండా, ఇంజిన్ వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆయిల్ ఎంత చిక్కగా  ఉంటే మీ బండి అంత సేఫ్‌. ఈ విస్కాసిటీ మంచిగా లేకపోతే అధిక వేడి కారణంగా సాధారణ అయిల్‌ పల్చగా మారిపోయి ఇంజిన్ భాగాలను కాపాడే సామర్థ్యం కోల్పోతుంది. 

వేసవి ఎండలను తట్టుకోవడానికి 10W-40 లేదా 15W-40 వంటి ఎక్కువ విస్కాసిటీ గ్రేడ్ ఆయిల్స్‌ను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇవి ఎంత వేడి ఉన్నా చిక్కదనాన్ని కోల్పోవు. తప్పుడు గ్రేడ్ ఆయిల్ వాడితే ఇంజిన్ భాగాల మధ్య రాపిడి పెరిగి ఓవర్ హీటింగ్ జరుగుతుంది. 

Continues below advertisement

ఇంజిన్ సీజ్ కాకుండా ఏం చేయాలి?

ఇంజిన్‌లోని పిస్టన్లు, క్రాంక్‌ షాఫ్ట్‌ వంటి భాగాలు విపరీతమైన వేడి వల్ల ఒకదానికొకటి అతుక్కుపోయినప్పుడు ఇంజిన్ సీజ్ అవుతుంది. ది జరిగితే కారు యజమానులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం, డ్యాష్ బోర్డుపై ఆయిల్‌ ప్రెషర్ వార్నింగ్ లైట్ వెలగడం, పొగ రావడం లేదా పికప్ తగ్గిపోవడం ఈ ఇంజిన్ సీజ్‌కు ప్రధాన సంకేతాలు. డ్యాష్ బోర్డ్‌పై ఆయిల్ లైట్ వెలిగిన వెంటనే కారు ఆఫ్ చేయాలి. బలవంతంగా నడిపితే ఇంజిన్ పూర్తిగా పాడైపోతుంది. దీని రిపేర్ ఖర్చు కొన్ని సార్లు కారు మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ కావచ్చు. 

కూలింగ్ సిస్టమ్‌, కూలెంట్ నిర్వహణ 

వేసవిలో ఇంజిన్ చల్లగా ఉండాలంటే రేడియేట్‌, కూలెంట్ వ్యవస్థ పక్కాగా పని చేయాలి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కూలెంట్ త్వరగా ఆవిరైపోతుంది. రైడియేటర్ ట్యాంక్‌లో కూలెంట్ ఎప్పుడూ మినిమం, మ్యాక్సిమమ్‌ మధ్య ఉందో లేదో చూసుకోవాలి. వారానికి ఒకసారైనా చెక్ చేయాలి. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ రేడియేర్‌ క్యాష్ తెరవకూడదు. అలా చేస్తే వేడి ఆవిరి, మరిగే నీరు ముఖంపై పడి తీవ్రమైన గాయాలు అవుతాయి. కనీసం అరగంట కారు చల్లబడిన తర్వాత క్యాప్ తెరవాలి. 

టైర్ల భద్రత చాలా ముఖ్యం 

హైవేలపై వెళ్తున్న వాహనాల టైర్లు పేలి ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా చూశాం. వేడి వల్ల టైర్లలోని గాలి వ్యాప్తి చెందుతుంది. అందుకే వేసవి కాలంలో లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు కంపెనీ సూచించిన దాని కంటే ఒకటి లేదా రెండు పీఎస్‌ఐ తక్కువ గాలి ఉంచడం మంచిది. కారు కనీసం మూడు గంటలు కంటిన్యూగా నడపకుండా ఉన్నప్పుడు మాత్రమే ప్రెషర్ చెక్ చేయాలి. 

వేసవిలో పనికి వచ్చే మరికొన్ని స్మార్ట్ హ్యాక్స్ 

భాగంచేయాల్సిన స్మార్ట్ వర్క్ లభించే ప్రయోజనం
కారు ఏసీఎక్కగా ఏసీ అన్ చేయకుండా ఒక నిమిషం విండోస్ దించి బ్లోయర్‌ ఆన్ చేయాలివేడి గాలి బయటకు పోయి, కారు త్వరగా చల్లబడుతుంది. 
పెట్రోల్ ట్యాంక్వేసవి కాలంలో ట్యాంక్ ఫుల్ చేయించకండిగ్యాస్ వ్యాకోచించడానికి కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. 
కారు బాడీ/పెయింట్   వీలైనంత వరకు నీడలో పార్క్ చేయాలి. లేదా వాక్స్ పాలిష్ వాడాలి.యూవీ కిరణాల వల్ల కారు రంగు వెలిసిపోకుండా ఉంటుంది. 

వేసవి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఎంతో మేలు చేస్తాయి. మీ కారు డ్యాష్ బోర్డుపై ఎలాంటి వార్నింగ్ లైట్స్ కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెటంనే మెకానిక్‌ను సంప్రందించండి.