Baby Born With Tail: 


బ్రెజిల్‌లో ఘటన..


బ్రెజిల్‌లో ఓ శిశువు తోకతో జన్మించింది. ఇది చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఆ తోక 6 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్టు చెప్పారు డాక్టర్లు. గర్భంలో ఉండగానే ఈ లోపం తలెత్తిందని, ఆ తోక పెరుగుతూ వచ్చిందని వివరించారు. దీన్నే వైద్య పరిభాషలో spina bifidaగా పిలుస్తారు. అంటే వెన్నముకతో పాటుగా అదనంగా ఓ తోక పెరుగుతుంది. స్పైనల్ కార్డ్ ఎదిగే క్రమంలో గ్యాప్ వస్తుందని, అదే తోకలా పెరుగుతుందని చెప్పారు వైద్యులు. అయితే...ఈ తోకను వెంటనే సర్జరీ చేసి తొలగించారు. చాలా సందర్భాల్లో తల్లికి ఏమైనా అనారోగ్యం ఉంటే ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ...ఈ కేసులో అలాంటిదేమీ లేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తల్లికి జన్మించిన శిశువుకి ఇలాంటి సమస్యలు రావడం చాలా అరుదు అని వివరిస్తున్నారు వైద్య నిపుణులు. శిశువుకు MRI చేసిన వైద్యులు పూర్తిగా డయాగ్నైజ్ చేసి సర్జరీ చేశారు. అయితే..ఇదంతా జరిగి మూడేళ్లు దాటింది.  Journal of Pediatric Surgery Case Reportsలో ఈ వివరాలు పబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ శిశువు వయసు మూడేళ్లు. ఆ సర్జరీ సక్సెస్‌ అవడమే కాకుండా...ఇప్పుడా చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడగా...దానికీ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి తనంతట తానుగా నడవగలుగుతోందని ఆ కేస్‌ రిపోర్ట్‌లో తెలిపారు. 


నాలుగు కాళ్లతో...


ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ శిశువు నాలుగు కాళ్లతో జన్మించింది. సోషల్ మీడియాలో ఈ శిశువు ఫోటోలు వైరల్ అయ్యాయి. కమలా రాజా విమెన్స్ అండ్ చైల్డ్ పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ శిశువు జన్మించింది. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయిపోయింది. సికందర్ కాంపు ప్రాంతానికి చెందిన ఆర్తి కుశ్వాహా అనే మహిళకు...ఆడ శిశువు జన్మించినట్టు వైద్యులు చెప్పారు. బిడ్డ ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. 2.3 కిలోల బరువుతో జన్మించినట్టు తెలిపారు. ప్రసవం జరిగిన వెంటనే ప్రత్యేక వైద్యుల బృందం శిశువుని పరీక్షించింది. "పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. శారీరక వైకల్యం వల్లే ఇలా జరిగింది. సాధారణంగా...పిండం రెండుగా విడిపోయినప్పుడు కవలలు  పుడతారు. కానీ...ఇక్కడ ఒకే  పిండానికి అదనపు శరీర భాగాలు పెరిగాయి. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే మెడికల్ సైన్స్‌లో ఇస్కియోపాగస్ అంటారు. నడుము కింది భాగంలో మరో రెండు కాళ్లు అదనంగా పుట్టుకొచ్చాయి. కానీ...అవి ప్రస్తుతానికి ఎట కదలడం లేదు" అని వైద్యులు స్పష్టం చేశారు. పిల్లల వైద్య నిపుణులు శిశువుని పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు. ఆరోగ్యంగానే ఉందా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇది కాకుండా శరీరంలో ఇంకేదైనా వైకల్యం ఉందా అన్నదీ గమనిస్తున్నారు. కొన్ని టెస్ట్‌లు చేసిన తరవాత బిడ్డ ఆరోగ్యంగా ఉందని తేలితే...ఆ రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. ఆ తరవాత శిశువు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశముంటుందని వైద్యులు స్పష్టం చేశారు. 


Also Read: Meta Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయా? వేలాది మందికి బ్యాడ్ రేటింగ్ - ఉద్యోగుల టెన్షన్