భాజపా..క్రిమినల్స్‌కి వాషింగ్ మెషీన్‌లా మారింది..
పశ్చిమ బెంగాల్ కేబినెట్‌లో కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టారు. పార్థ ఛటర్జీ వివాదం తరవాత ఉన్నట్టుండి కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం మమతా బెనర్జీ. ఈ మంత్రివర్గంలో భాజపా మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు. టూరిజం, ఐటీశాఖా మంత్రిగా సుప్రియోను నియమించారు దీదీ. ప్రమాణ స్వీకారం చేశాక ఆయన భాజపాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం టీఎమ్‌సీని వదిలి భాజపాలో చేరిన ఆయన..మళ్లీ సొంత గూటికే చేరారు. అయితే దీనిపై భాజపా నేతలు కొందరు ట్విటర్‌లో ట్రోల్ చేశారు. "కండువా మార్చేశాడు" అంటూ కొందరు ఆయనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈ ట్రోల్స్‌పై స్పందించారు. తనను బలిపశువుగా మార్చాలనుకున్న భాజపాను ఎదిరించి టీఎమ్‌సీలో చేరటం ఎంతో ఆనందంగా ఉందని తేల్చి చెప్పారు. అదే సమయంలో భాజపాపై మండి పడ్డారు. "భాజపా అధికారంలో రాష్ట్రాల్లో సగం వరకూ, ఎమ్మెల్యేలందరూ వేరే పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చిన వాళ్లే. బెంగాల్‌లోనూ ఆపరేషన్ ఝార్ఖండ్‌ని అమలు చేయాలని చూస్తున్నారు" అంటూ విమర్శించారు. భాజపా..క్రిమినల్స్‌కి వాషింగ్ మెషీన్‌లా మారిందనిసెటైర్లు వేశారు.
"అధికార పార్టీపై, ప్రతిపక్షాలు ఇంత అసంతృప్తితో ఉండటం బహుశా చరిత్రలో ఎప్పుడూ లేదు" అని ట్వీట్ చేశారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014,2019లో వరుసగా ఎంపీగా విజయం సాధించిన బాబుల్ సుప్రియో పట్టణాభివృద్ధి మంత్రిగా, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే గతేడాది భాజపా టికెట్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడే యూనియన్ క్యాబినెట్ నుంచి అధిష్ఠానం తప్పించింది. ఈ అసంతృప్తితో భాజపా వీడారు సుప్రియో. గతేడాది సెప్టెంబర్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఏడాది బై ఎలక్షన్‌లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి వరించింది.
Also Read: ఏమైంది ఈమెకు? బురదలో పొర్లుతూ, మట్టి ఒంటికి పూసుకుంటున్న బాలీవుడ్ నటి
Also Read: Har Ghar Tiranga Song: ప్రభాస్, కీర్తి సురేష్, కొహ్లీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్, మనసంతా భారతీయమే!