Sunita Williams To Fly Into Space: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బోయింగ్ కంపెనీకి చెందిన Starliner స్పేస్‌క్రాఫ్ట్‌లో ఆమె మూడోసారి స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొలిసారి మానవ సహిత అంతరిక్షత యాత్ర చేపడుతోంది (Boeing) బోయింగ్ కంపెనీ. సునీతా విలియమ్స్‌తో పాటు నాసా ఆస్ట్రోనాట్ బ్యారీ బచ్ విల్మోర్‌ (Barry Butch Wilmore) కూడా అంతరిక్ష యానం చేయనున్నారు. భారతదేశ కాలమానం ప్రకారం మే 7 ఉదయం 8.04 గంటలకు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌లో సునీత విలియమ్స్ మిషన్‌ పైలట్‌గా ఉండనున్నారు. ఫ్లోరిడాలోని కేప్ కానావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ (Cape Canaveral Space Force Station) నుంచి ఇది లాంఛ్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వ్యోమగాముల్ని తరలించేందుకు ఉద్దేశించిన ఈ మిషన్‌ని ఎలాగై విజయవంతం చేయాలని చూస్తోంది బోయింగ్ సంస్థ. నాసాకి ఇదో ప్రత్యామ్నాయంగా ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే ఎలన్ మస్క్‌  SpaceX కి సంబంధించిన Crew Dragon ISSకి వ్యోమగాముల్ని తీసుకెళ్తోంది. ఇప్పుడు ఈ మిషన్‌తో ఈ లిస్ట్‌లో చేరిపోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా నాసాకి చెందిన కెనెడీ స్పేస్‌ సెంటర్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కీలక విషయాలు వెల్లడించారు సునీతా విలియమ్స్. 


"అంతరిక్షంలోకి వెళ్తుంటే నాకు నా పుట్టింటింకి వెళ్లినంత ఆనందంగా ఉంటుంది. నాకు విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం. స్పేస్‌లోకి వెళ్లేటప్పుడు నాతో పాటు ఆయన ప్రతిమని తీసుకెళ్తాను. అంతరిక్షంలో సమోసాలు తినడమన్నా నాకెంతో ఇష్టం"


- సునీతా విలియమ్స్, వ్యోమగామి






322 రోజుల పాటు స్పేస్‌లో..


మొత్తం 10 రోజుల పాటు విలియమ్స్, విల్‌మోర్ స్టార్‌లైనర్ సిస్టమ్‌ని పూర్తి స్థాయిలో పరీక్షించనున్నారు. ఈ సిస్టమ్ సామర్థ్యాన్నీ పరిశీలించనున్నారు. అనుకున్న విధంగా ఈ మిషన్ విజయవంతం అయితే ఇకపై సిబ్బందిని తరలించేందుకు ఈ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లను వినియోగిస్తారు. ఇలా మానవసహిత తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ మిషన్‌లో పాల్గొనే తొలి మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించనున్నారు. నేవీ టెస్ట్‌ పైలట్‌గా క్వాలిఫై అయిన ఆమె 2006లో ఓ సారి 2012లో మరోసారి స్పేస్‌లోకి వెళ్లి వచ్చారు. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం సునీతా విలియమ్స్ అంతరిక్షంలో మొత్తం 322 రోజుల పాటు గడిపారు. ఎక్కువ సమయం పాటు స్పేస్‌వాక్‌ చేసిన మహిళా వ్యోమగామిగానూ రికార్డు సృష్టించారు. మొత్తం 7  సార్లు కలిపి (Sunita Williams Spacewalks) 50 గంటల 40 నిముషాల పాటు స్పేస్ వాక్‌ వాక్ చేశారు. ఆ తరవాత ఆ రికార్డ్‌ని మరో వ్యోమగామి అధిగమించారు. 10 సార్లు స్పేస్‌వాక్ చేశారు.


 Also Read: పాకిస్థాన్ గాజులు తొడుక్కుని కూర్చోలేదు,అణుబాంబులు వేస్తుంది - పీవోకే వివాదంపై ఫరూక్ అబ్దుల్లా