Assam News: అసోం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు.
ఇదీ జరిగింది
డిబ్రుగఢ్ యూనివర్సిటీలో బాధితుడు ఆనంద్ శర్మ ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఆదివారం పీఎన్జీబీ వసతి గృహంలో నివసించే తోటి విద్యార్థులు అతడ్ని ర్యాగింగ్ చెయ్యడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం ఆనంద్ శర్మ హాస్టల్ భవనం పైనుంచి దుకేశాడు. గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎం స్పందన
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు.
Also Read: Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'