Assam CM Z-Plus Security: 


దేశవ్యాప్తంగా జెడ్ ప్లస్ భద్రత


అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆయనకు Z కేటగిరీ భద్రత ఉండగా..దాన్ని Z Plusకి అప్‌గ్రేడ్ చేసింది. ఆయనకు ప్రస్తుతం Central Reserve Police Force (CRPF) Z కేటగిరీ భద్రత అందిస్తోంది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటి నుంచి జెడ్ ప్లస్‌ భద్రత అందించనుంది. కేంద్ర భద్రతా సంస్థలతో చర్చించిన తరవాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బిశ్వశర్మకు భద్రత పెంచటం మంచిదని సూచించగా...వెంటనే అమలు చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా ఇదే భద్రత ఆయనకు లభిస్తుంది. హిమంత బిశ్వశర్మ ఇప్పటి నుంచి ఎక్కడకు వెళ్లినా ఆయన వెంట 50 మంది కమాండోలు ఉంటారు. 2017లో శర్మకు Z కేటగిరీ భద్రతనిచ్చిన కేంద్రహోం శాఖ, రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే భద్రత ఇవ్వనుంది. 


ఆర్ఎస్ఎస్ నేతలకు..


కేంద్ర ప్రభుత్వం కేరళలోని ఐదుగురు RSS నేతలకు Y కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. వారికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో...రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై ఐదేళ్లపాటు నిషేధం విధించింది కేంద్రం. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో PFI నిరసనలు చేపడుతోంది. కేరళలో ఇవి కాస్త తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే...కేంద్రం అప్రమత్తమైంది. ఆ ఐదుగురు RSS నేతలకు ముప్పు ఉందని గమనించి ముందుగానే భద్రత పెంచారు. CRPF,VIP సెక్యూరిటీ విభాగం..Y సెక్యూరిటీ ఇస్తాయి. ఒక్కో RSS సభ్యుడికి ఇద్దరి నుంచి ముగ్గురి వరకూ కమాండోలు భద్రత కల్పిస్తారు. PFI నిఘాలో RSS ఉందని, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. జూన్‌లో అగ్నిపథ్‌పై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో బిహార్ భాజపా చీఫ్ సంజయ్ జైస్వాల్‌కు కూడా Y కేటగిరీ భద్రత కల్పించారు. చాన్నాళ్లుగా RSSలోని కీలక నేతలకు, BJP నేతలకు సెక్యూరిటీ పెంచారు.


అంబానీకి..?


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి Z ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతినిస్తుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇది దృష్టిలో ఉంచుకుని...ఇంటిలిజెన్స్ వర్గాల సూచన మేరకు ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయనకు Z  కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. గతేడాది ముంబయిలోని ఆయన నివాసం అంటిలీయాకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమ త్తమైన కేంద్రం వెంటనే భద్రత పెంచింది. కేవలం అంబానీ అనే కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ భద్రత పెంచాలని అప్పుడే 
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావించింది.  ఇండియాలో ప్రముఖ వ్యక్తులకు..వాళ్ల పాపులారిటీ ఆధారంగా ఈ భద్రత అందిస్తారు. అధికారిక భాషలో దీన్ని Security Cover అంటారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...ఏ కేటగిరీ భద్రత అందించాలో హోం శాఖ నిర్ణయం తీసుకుంటుంది.


Also Read: Levi’s Jeans Sold for Rs 71 Lakhs: అయ్య బాబోయ్! ఈ పాత ప్యాంట్ ధర రూ. 71 లక్షలట, ఎందుకో తెలుసా?