Leonardo DiCaprio:


కజిరంగ నేషనల్ పార్క్‌కు ఇన్విటేషన్..


అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ..హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియోను ఇన్వైట్ చేశారు. కజిరంగ నేషనల్ పార్క్‌ను విజిట్ చేయాలని కోరారు. ఖడ్గమృగాలు అంతరించిపోకుండా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని లియోనార్డో ఇన్‌స్టా వేదికగా పొగిడారు. దీనికి బదులిచ్చిన హిమంత బిశ్వ శర్మ...ఓ సారి వచ్చి సందర్శించాలంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లియోనార్డో చేసిన పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు హిమంత. 


"వన్యప్రాణులను కాపాడుకోవటం అంటే మన సంస్కృతిని రక్షించుకుంటున్నట్టే. వీటి సంరక్షణకు మేమెంతో అంకిత భావంతో పని చేస్తున్నాం. లియోనార్డో డికాప్రియో...మీకు మా కృతజ్ఞతలు. ఓ సారి కజిరంగ పార్క్‌ను మీరు సందర్శించాలని ఇన్వైట్ చేస్తున్నాను" 


హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం


ఇన్‌స్టాగ్రామ్‌లో లియోనార్డో అసోం ప్రభుత్వ చొరవను ప్రశంసించారు. ఖడ్గమృగాలు వేటకు బలి కాకుండా కాపాడుతున్న తీరుని అభినందించారు. 


"2000-21 మధ్య కాలంలో భారత్‌లో మొత్తం 190 ఖడ్గమృగాలు వేటకు బలి అయ్యాయి. కేవలం వాటి కొమ్ముల్ని అమ్ముకు నేందుకు వేటగాళ్లు దారుణంగా వాటిని చంపేశారు. అసోం ప్రభుత్వం ఇప్పుడు రంగంలోకి దిగింది. వేటకు గురి కాకుండా వాటిని సంరక్షిస్తోంది. కజిరంగ నేషనల్ పార్క్‌లో వాటిని సంరక్షిస్తోంది. ప్రస్తుతం అక్కడ 2,200 ఖడ్గమృగాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల్లో ఇది మూడో వంతు." 


- లియోనార్డో డికాప్రియో, హాలీవుడ్ నటుడు 


 










మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇటీవలే నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని ఇటీవలే ట్వీట్ చేశారు. అయితే...చిరుతల సంరక్షణలో భాగంగా భారత్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ సారి 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి రప్పించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కునో నేషనల్ పార్క్అధికారులు చెప్పిన వివరాల ప్రకారం...12 చీతాలను సౌతాఫ్రికా నుంచి తెచ్చే విషయమై భారత ప్రభుత్వానికి, ఆ దేశానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నాటికి ఈ చీతాలు కునో నేషనల్ పార్క్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఇటీవలే ఈ పార్క్‌ను సందర్శించారు. చీతాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఆరా తీశారు. చీతాలన్నీ ఆరోగ్యంగా ఉండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ అధికారులను ప్రశంసించారు. సౌతాఫ్రికా నుంచి వచ్చే 12 చీతాలకు ఇప్పటికే 14 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.


Also Read: TAPAS Drone: ఇండియన్ ఆర్మీలోకి పవర్‌ఫుల్ తపస్‌ డ్రోన్‌, ఆ ఈవెంట్‌లో గ్రాండ్ ఎంట్రీ