Gujarat Assembly Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే 10 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు కేజ్రీవాల్. తాజాగా గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు.






ఇవే హామీలు



  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

  • 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

  • నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామన్నారు. 


ఆరోపణలు


గుజరాత్‌లోని కో-ఆపరేటివ్‌ రంగంలో ఉద్యోగాలన్నీ సన్నిహితులు, బంధువులకే ఇస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ను గెలిపిస్తే అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు. పేపర్‌ లీక్‌లు జరగకుండా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దిల్లీలో అధికారం చేపట్టిన కొన్ని సంవత్సరాల్లోనే 12 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. 


జోష్


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్‌ఆద్మీకి ఫుల్ జోష్ వచ్చింది. దీంతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్‌లో జెండా ఎగరేయాలని కేజ్రీవాల్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఎప్పుడో కసరత్తు మొదలు పెట్టారు కేజ్రీవాల్. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆప్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేశారు.


10 మందితో


ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) ఎన్నికల్లో పోటీచేసే 10 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇటీవల విడుదల చేసింది ఆమ్‌ఆద్మీ. భీమాభాయ్ చౌదరి, జగ్మల్ వాలా, అర్జున రథ్వా, సాగర్ రబరి, వశ్రామ్, రామ్ ధనుక్, శివపాల్ బరసియా, సునీల్ వాఘాని, రాజేంద్ర సోలంకి, ఓంప్రకాష్ తివారీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో ఎక్కువ మంది పాటిదార్ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. గుజరాత్‌లో 111 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


Also Read: Afghanistan Bomb Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు- 8 మంది మృతి!


Also Read: Nasa Voyager Golden Record: ఏలియన్స్‌తో దోస్తీ కోసం 45 ఏళ్లుగా నిరీక్షణ!