Afghanistan Bomb Blast: అఫ్గానిస్థాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. రాజధాని నగరం కాబూల్‌లో రద్దీగా ఉండే ఒక షాపింగ్ స్ట్రీట్‌లో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు.






ఇలా జరిగింది


కాబూల్ పశ్చిమ ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. మైనార్టీలైన షియా తెగ వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతంలో బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలుడు తమ పనేనని సున్నీ ముస్లిం మిలిటెంట్ గ్రూప్ సంస్థ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వెల్లడించింది.


దర్యాప్తు


బాంబు పేలిన ప్రాంతంలో దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్లు గతేడాది ఆగస్ట్‌లో అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుని పాలిస్తున్నారు. అప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుళ్లు ఎక్కువయ్యాయి. తాలిబన్ల పాలనను వ్యతిరేకించే ప్రజలకు కూడా అక్కడ బతకడం కష్టంగా ఉంది. పైగా ఈ పేలుళ్లతో ప్రజలకు రోజూ గండంగానే గడుస్తోంది.


క్రికెట్ స్టేడియంలో


కాబూల్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇటీవల ఆత్మాహుతి పేలుడు జరిగింది. వెంటనే ఆటగాళ్లందరనీ సురక్షితంగా బంకర్‌లోకి తరలించారు అధికారులు. పేలుడు తర్వాత గందరగోళం ఏర్పడడం వల్ల భయాందోళనలకు గురైన వీక్షకులంతా పరుగులు తీశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు






బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్, పామిర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగినప్పుడు ఐరాస ప్రతినిధులు స్టేడియంలోనే ఉన్నారు.


Also Read: Nasa Voyager Golden Record: ఏలియన్స్‌తో దోస్తీ కోసం 45 ఏళ్లుగా నిరీక్షణ!


Also Read: Viral Video: స్టేషన్‌లోకి చొరబడి పోలీసుపైనే మూక దాడి- షాకింగ్ వీడియో!