Minister KTR Challenge: తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్సెప్ట్ చేశారు. ఇంతకీ ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారా? చేనేత ఛాలెంజ్. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా చేనేత బట్టలు ధరించి ఆ ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్‌ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌, పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ విసిరారు.


అయితే, జాతీయ చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కేటీఆర్‌ను రామ్ భాయ్ అంటూ సంబోదిస్తూ చేనేత బట్టలు వేసుకున్న ఫోటోలను ట్వీట్ చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి పవన్‌ చేనేత బట్టల సవాలును విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు.






‘‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌) మీ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేశా. చేనేత వర్గాల పట్ల నాకు ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు ఉన్నాయి’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనికి పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి బాలినేని  శ్రీనివాస్, తెలంగాణ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులను ట్యాగ్ చేశారు. అందుకు మంత్రి కేటీఱర్ థ్యాంక్యూ