Arvind Kejriwal Eating Mangoes: తీహార్ జైల్‌లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు కావాలనే ఆయన మామిడి పండ్లు అతిగా తింటున్నారని అసహనం వ్యక్తం చేసింది. షుగర్ పెంచుకుని ఆ సాకుతో బెయిల్‌పై బయటకు రావాలని చూస్తున్నారని ఆరోపించింది. మామిడి పండ్లతో పాటు ఆలుపూరి, స్వీట్‌లు విపరీతంగా తీసుకుంటున్నారని చెప్పింది. మెడికల్ బెయిల్ కోసం ఇదంతా చేస్తున్నారని తేల్చి చెప్పింది. వైద్యులను సంప్రదించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే ఈడీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై కోర్టు స్పందించింది. జైల్లో కేజ్రీవాల్ ఎలాంటి డైట్ తీసుకుంటున్నారో ఓ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి అందించాలని తిహార్ జైల్ అధికారులను ఆదేశించింది. కేజ్రీవాల్ లాయర్‌కీ ఇవే ఆదేశాలిచ్చింది కోర్టు. డైట్ డిటెయిల్స్ (Kejriwal Diet) వెల్లడించాలని స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ type 2 diabetes పేషెంట్ కావడం వల్ల షుగర్ లెవెల్స్ అప్పుడప్పుడూ అటూ ఇటూ అవుతుంటాయి. అయితే...ఆయన కావాలనే షుగర్ పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించడమే కీలకంగా మారింది. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేందుకు కేజ్రీవాల్‌కి అనుమతినిచ్చారని కానీ ఆయన అదేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన డైట్ ఫాలో అవుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.
"అరవింద్ కేజ్రీవాల్ కావాలనే షుగర్ ఎక్కువగా ఉన్న టీ, అరటి పండ్లు, స్వీట్‌లు, పూరీ, ఆలూ సబ్జీ, మామిడి పండ్లు తింటున్నారు. రోజూ ఇదే డైట్ ఫాలో అవుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్లు ఇలాంటి తీపి పదార్థాలు తింటే ఒక్కసారిగా బ్లడ్‌లో షుగర్ పెరిగిపోతుంది. దీన్నే సాకుగా చూపించి మెడికల్ బెయిల్ తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. సింపథీ కోసమే ఇదంతా చేస్తున్నారు"
- ఈడీ
కేజ్రీవాల్ లాయర్ అసహనం..
జైల్‌లో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటున్నారని, రోజుకు రెండు సార్లు షుగర్ టెస్ట్‌లు చేస్తున్నారని కోర్టుకి వివరించింది ఈడీ. ఈ సందర్భందా కేజ్రీవాల్ మెడికల్ రిపోర్ట్‌నీ వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఆయన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో వివరించింది. అయితే...కేజ్రీవాల్ తరపున లాయర్ మాత్రం ఈడీ ఆరోపణల్ని కొట్టిపారేశారు. మీడియా అటెన్షన్ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. వేరెవరిదో రిపోర్ట్ తీసుకొచ్చి ఇలా చెబుతున్నారని ఆరోపించారు.
Also Read: ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు