Seethe Ramudi Katnam Today Episode

  సుమతి నిలయం అని ఇంటి గేటు బయట సీత బోర్డు పెట్టిస్తుంది. దీంతో అందరూ సీతని మెచ్చుకుంటారు. చలపతి రేవతిలతో పాటు రామ్, జనార్థన్‌ సీతని తెగ పొగిడేస్తారు. అది చూసి మహాలక్ష్మి, అర్చన, గిరిధర్‌లు రగిలిపోతారు.


సీత: అవును మామయ్య ఈ మహాలక్ష్మి అత్తయ్య గురించి సుమతి అత్తయ్యకు తెలుసా.. అంటే అత్తమ్మ చనిపోయాక ఈ అత్తయ్యని పెళ్లి చేసుకున్నారా లేక..
జనార్థన్: లేదమ్మ మీ అత్తయ్య బతికుండగానే మహా ఈ ఇంటికి వచ్చింది. అసలు మహా ఈ ఇంటికి రావడానికి కారణమే సుమతి. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. 
సీత: అంటే మహాలక్ష్మి అత్తయ్యకు లైఫ్ ఇచ్చింది సుమతి అత్తమ్మ అన్నమాట. ఈ ఇంటికి సుమతి అత్తమ్మ పేరు పెట్టడం మీకు ఆనందమే కదా అత్తయ్య. 
మహాలక్ష్మి: చాలా మంచి పని చేశావ్ సీత. ఈ ఇంటికి సుమతి పేరు కరెక్ట్. తనకు ఆ అర్హత ఉంది. 


సీత: అత్తయ్య.. ఏంటి మహాలక్ష్మి ఇంటిని సుమతి పేరుగా మార్చానని రగిలిపోతున్నారా. ఇరవై ఏళ్లగా ఓ వెలుగు వెలిగిన మీ పేరు మారితే బాధ గానే ఉంటుంది. ఇనాళ్లు సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లు ఆస్తిని అనుభవించారు. మీ దగ్గర నుంచి ఒక్కోక్కటి దూరం అయిపోతున్నాయి. మా అత్తమ్మ మీకు మంచి చేసి ఈ హోదా ఇచ్చింది. అలాంటి అత్తమ్మను మీరు ఏ రోజు తలచుకోలేదు. తన ఫోటో స్టోర్‌ రూంలో పడేశారు.
మహాలక్ష్మి: సుమతి యాక్సిడెంట్‌లో చనిపోయింది. తన ఫొటో హాల్‌లో పెట్టి ఇంటికి కంపెనీలకు తన పేరు పెట్టి రామ్‌ని బాధ పెట్టాలా.. పోయిన వాళ్ల కోసం ఉన్న వాళ్లని ఇబ్బంది పెట్టాలా. అందుకే సుమతిని దూరం పెట్టా..
సీత: ఫ్రెండ్‌ అని మా అత్తమ్మ కనికరించకపోయి ఉంటే మీరు పూలు అమ్ముకొనే వాళ్లే కట్టెలు అమ్ముకొనే వాళ్లేమో.. త్వరలో రాళ్లు కూడా కొడతారేమో.
మహాలక్ష్మి: ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్.
సీత: మా అత్తమ్మ యాక్సిడెంట్‌లో చనిపోయింది అని మీరు అంటున్నారు. అది ప్రమాదమో లేక ప్లానో తెలీదు. మా అత్తమ్మ ఫొటో కాలిపోయిందో కాల్చేసిందో తెలీదు. అత్తమ్మ డైరీలో కొన్ని పేజీలు చిరిగిపోయాయో లేక చించేశారో తెలీదు. తెలుసుకుంటాను త్వరలోనే అన్నీ తేల్చుతాను. ఈ ఇంటికి అథిదిగా వచ్చిన మీరు అత్తయ్య ఎలా అయ్యోరో అన్నీ తేల్చుతాను. అత్తమ్మను బాధ పెట్టి దూరం చేశారో అందరూ బాధ పడకూడదు అని దాచిపెట్టారో తేల్చుతా. నిజం తెలిసిన రోజు మీతో సహా ఏ ఒక్కర్ని వదిలి పెట్టను.  
మహాలక్ష్మి: సుమతి నా ఫ్రెండ్ అని తెలిసినందుకే సీత ఇన్ని ఆరాలు తీస్తుంది. అదే సుమతి తన మేనత్త అని తెలిస్తే సీత ఇంకెంత దూరం వెళ్తుందో. నేను చిక్కుల్లో పడతాను. నా మీద ఎవరికీ అనుమానం రాకుండా నేను జాగ్రత్త పడాలి. ఛా జనా అందరి ముందు నా సుమతి నా ఫ్రెండ్ అని చెప్పాడు. సుమతి చనిపోయి కూడా సీత రూపంలో నా మీద పగ తీర్చుకుంటుంది.


మరోవైపు సుమతి బట్టలు సర్దుకుంటుంది. మరోకామె వచ్చి ఎక్కడికి వెళ్తాను అని అంటే మహాలక్ష్మి దగ్గరకు వెళ్తాను అని చెప్తుంది. తన పిల్లల్ని మహా దగ్గర వదిలి పెట్టాను అని మహా వాళ్లని జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్తుంది. తన ఫ్రెండ్ మంచి తనం గురించి చెప్తుంది. తన పిల్లలకు పునర్జన్మనిచ్చిందని చెప్తుంది. 


ఫ్లాష్‌బ్యాక్


ఒకసారి మహాలక్ష్మి, సుమతి, జనార్థన్ బయట నుంచి వచ్చే సరికి రామ్ ప్రీతిలు కిచెన్‌లో మంటల్లో చిక్కుకుంటారు. అప్పుడు మహాలక్ష్మి తన ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడుతుంది. మహాకు సుమతి థ్యాంక్స్ చెప్తే పిల్లలు తన ప్రాణం అని మహా చెప్తుంది. ఇక సుమతి రెండు చేతులెత్తి మహాలక్ష్మిని దండం పెడుతుంది. ఇక మహా పనివాడిని లాగిపెట్టి ఒకటి కొడుతుంది. వార్నింగ్ ఇస్తుంది. 


ప్రస్తుతం


మహాలక్ష్మి: ఇప్పటి వరకు సుమతి విషయంలో నేను ఏం చెప్తే అందరూ అది నమ్మారు. నన్ను నెత్తిన పెట్టుకున్నారు. దాదాపు సుమతి కనుమరుగువుతున్న టైంలో ఆ సీత వచ్చి మళ్లీ అందరికీ గుర్తు చేస్తుంది. సుమతి విషయంలో నా పాత్ర గురించి అనుమానం రాకుండా సీతని నమ్మించాలి. రామ్, ప్రీతిల విషయంలో సుమితినే నేను ఎంత గానో నమ్మించాను. ఆరోజు కిచెన్‌లో అగ్ని ప్రమాదం నా ప్లాన్ అని సుమతికి తెలీదు. 


మహాలక్ష్మి పనివాడితో గ్యాస్ లీక్ చేయమని అందులో రామ్, ప్రీతిలు చిక్కుకుపోయేలా చేయమని చెప్తుంది. ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడొద్దని పనివాడికి పంపేస్తుంది. ఆ రోజు అలా చేయగానే రామ్, ప్రీతిలను సుమతి తనకు అప్పగించిందని అందర్ని నమ్మిన తనని సీత అనుమానిస్తుందని సీతకు చెక్ పెట్టాలని మహా అనుకుంటుంది. 


రాత్రి సీత రామ్ కోసం పాలు పట్టుకొని వెళ్లే సరికి బెడ్ మీద రామ్, మధుమితలు ఉంటారు. అది చూసిన సీత తన అక్కని మధుమితను నిలదీస్తుంది. వర్క్ పక్కన పెట్టి పాలు తాగి పడుకోమని రామ్ సీతకు చెప్తాడు. రామ్ సీతను డిస్ట్రబ్‌ చేయొద్ద అని అంటాడు. ఇక మధుమిత కూడా సీత ఇబ్బంది పెట్టకు నీకు నిద్ర వస్తే వెళ్లి పడుకో అని బయటకు పంపేస్తుంది. సీత ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేస్తుంది. ఇక మహా సీతకు ఎదురొచ్చి ఇదంతా తన ప్లానే అని సీతకు చెప్తుంది. రామ్ మధులను దగ్గరకు చేయడానికి ఇలా రాత్రంతా వాళ్లు ఒకే గదిలో ఉండేలా చేశానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఈ ఒక్క ట్యాబ్లెట్‌తో కృష్ణ ఇక జన్మలో తల్లి కాలేదు.. ఆట మొదలు పెట్టిన ముకుంద!