Manish Sisodia Arrest:


సిసోడియాపై గౌరవం..


మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అధికారుల్లో కొందరు సిసోడియా అరెస్ట్‌ను ఖండించారని, కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయనను అరెస్ట్ చేశారని అన్నారు. ఆయనపై వారికి ఎంతో గౌరవముందని వెల్లడించారు. ట్విటర్‌లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. 


"చాలా మంది సీబీఐ అధికారులు సిసోడియా అరెస్ట్‌ను వ్యతిరేకించారు. ఆయన తప్పు చేశారన్న ఆధారాలు ఏమీ లేవు. అందుకే వాళ్లు ఆయనను గౌరవించారు. కానీ ఆయనను అరెస్ట్ చేయాల్సిందేనంటూ రాజకీయంగా ఒత్తిడి చేశారు. అందుకే వాళ్లు తలొగ్గక తప్పలేదు" 


-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు కేజ్రీవాల్. సిసోడియాను తప్పకుండా అరెస్ట్ చేస్తారంటూ జోస్యం చెప్పారు కూడా. అంతే కాదు. త్వరలోనే ఆయన జైలు నుంచి విడుదవ్వాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.  ఆయన అన్నట్టుగానే సీబీఐ అధికారులు విచారణ పూర్తైన వెంటనే సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. 


"మనీశ్...మీకు భగవంతుడు తోడుగా ఉన్నాడు. లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీ వెంట ఉన్నాయి. దేశం కోసం, సమాజ ఉన్నతి కోసం జైలుకు వెళ్తున్నారు. జైలుకు వెళ్లినంత మాత్రాన అవినీతికి పాల్పడినట్టు కాదు. దీన్ని ఓ గౌరవంగా భావించండి. మీరు త్వరలోనే జైలు నుంచి విడుదవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు మొత్తం ఢిల్లీ పౌరులు మీ కోసం ఎదురు చూస్తుంటారు" 
-అరవింద్‌ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 


వైద్య పరీక్షలు పూర్తి..


సిసోడియాను కోర్టులో హాజరు పరచనున్నారు CBI అధికారులు. అయితే...అంతకు ముందు మెడికల్ టెస్ట్‌లు చేశారు.  ABP Newsకి అందిన సమాచారం ప్రకారం...ఉదయం 10 గంటలకే ఈ పరీక్షలు పూర్తయ్యాయి. CBI హెడ్‌క్వార్టర్స్‌లోనే ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక మిగిలింది కోర్టులో హాజరుపరచడమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చాన్నాళ్లుగా సిసోడియా పేరు వినిపిస్తోంది. ఆయనను 8.5 గంటల పాటు విచారించిన అధికారులు...ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సిసోడియా నిందితుడే అని అంటోంది సీబీఐ. అంతకు ముందే  ఓ సారి సమన్లు జారీ చేసి విచారించిన CBI..ఇటీవల మరోసారి నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే...ఓ వారం రోజుల గడువు అడిగారు మనీశ్ సిసోడియా. బడ్జెట్ తయారీలో ఉన్నానని, ఆ పని పూర్తయ్యే వరకూ గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు CBI విచారణ తేదీని మార్చింది. నిన్న (ఫిబ్రవరి 26) సాయంత్రం విచారణ పూర్తైన వెంటనే ఆయనను అరెస్ట్ చేసింది. తాము అడిగిన ప్రశ్నలకు సిసోడియా సరైన సమాధానాలు చెప్పలేదని, అందుకే అరెస్ట్ చేశామని వెల్లడించింది. ఆయన అరెస్ట్ అయిన తరవాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిసోడియా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


Also Read: Vivek Venkataswamy: త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఆయన తరహాలోనే - వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు