India China Border:


అరుణాచల్‌ప్రదేశ్ యువకులు..


చైనా సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న ఔషధ మొక్కలపై పరిశోధన చేసేందుకు వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్‌కు ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. ఆగస్టు నుంచే వాళ్లు మిస్ అయ్యారు. భారత్‌-చైనా సరిహద్దులోని అంజా జిల్లాకు చెందిన బతైలం తిక్రో (33), బయింగ్సో మన్యు(31) చగలగమ్‌కు వెళ్లారని..అప్పటి నుంచి కనిపించకుండా పోయారని అంజా డిస్ట్రిక్ట్ ఎస్పీ రైక్ కంసీ వెల్లడించారు. 
ఆగస్టు 19 నుంచి ఇప్పటి వరకూ వారి జాడ లేదని తెలిపారు. "అక్టోబర్ 9వ తేదీన ఆ యువకుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేం ఇప్పటికే ఆర్మీతో మాట్లాడాం. వారిని గాలిస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది" అని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో అరుణాచల్‌కు చెందిన వ్యక్తులు కనిపించకుండా పోవటం ఇదే తొలిసారి సాదు.






మిస్సింగ్ మిస్టరీలు..


ఈ ఏడాది జులైలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాదాపు 18 మంది కనిపించకుండా పోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో ఓ నిర్మాణ పనికి వెళ్లిన కార్మికులంతా ఇలా మిస్ అవటం సంచలనమైంది. ఈ ఏడాది జనవరిలో 17 ఏళ్ల మిరామ్ టరోన్ మిస్ అయ్యాడు. జిడో గ్రామానికి చెందిన ఈ కుర్రాడు ఉన్నట్టుండి కనిపించకపోవటం స్థానికంగా అలజడి రేపింది. అయితే...ఆ తరవాత జనవరి 27న చైనా ఆర్మీ...ఆ బాలుడిని భారత్ ఆర్మీకి అప్పగించింది. చైనా సైన్యమే ఆ బాలుడిని కావాలని కిడ్నాప్ చేసి...వారం రోజుల తరవాత విడుదల చేసిందన్న ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు...ఆ బాలుడు చెప్పిన మాటలూ అందుకు ఆజ్యం పోశాయి. తనను దారుణంగా కొట్టారని, కరెంట్ షాక్ ఇచ్చి చిత్రవధ చేశారనీ చెప్పాడు. బాలుడి తండ్రి ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ "నా కొడుకు ఆ ఘటన తరవాత మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు" అని వివరించారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు యువకుల మిస్సింగ్‌..మిస్టరీగా ఉంది. 
మళ్లీ చైనా సైన్యమే వారిని అదుపులోకి తీసుకుని హింసింస్తోందా..? అన్న వాదన నడుస్తోంది. 


Also Read: Gujarat Election 2022: ఆపరేషన్ గుజరాత్‌కు భాజపా రెడీ, ప్రధాని ఇంట్లో కీలక భేటీ