Army Helicopter Crash:


జమ్ముకశ్మీర్‌లో ప్రమాదం..


జమ్ముకశ్మీర్‌లోని కిష్‌త్వర్ జిల్లాలో ఆర్మీ చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. అదృష్టవశాత్తూ వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.  ALH Dhruv హెలికాప్టర్ మర్వా ప్రాంతంలో కుప్ప కూలినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ALH Dhruv Mark 3  హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్ప కూలింది. చాపర్‌ను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది జరిగిన సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే...ఇప్పుడు కశ్మీర్‌లో జరిగిన ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.