Army Helicopter Crash:
రాజస్థాన్‌లో ప్రమాదం..
ఆర్మీ హెలికాప్టర్లు, చాపర్‌లు కూలిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో ఓ చాపర్ కూలిపోయి ఓ పైలట్ మృతి చెందాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌మార్గ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. సూరత్‌గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్...కాసేపటికే కూలిపోయింది. పారాచూట్ సాయంతో పైలట్ సహా కో పైలట్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే...ఆ చాపర్ ఓ ఇంటిపై కూలడం వల్ల ఆ ఇంట్లోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలోనూ సుఖోయ్, మిరేగ్ విమానాలు కుప్ప కూలిన ఘటనల్లో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్‌లోనే భరత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. మధ్యప్రదేశ్‌లోనూ మొరెనా ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఏప్రిల్‌లో కొచ్చిలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి.