Viral Video:
వేలి ముద్రల ఆధారంగా విచారణ..
అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టినా కిర్చ్‌నర్ (Cristina Kirchner)పై హత్యాయత్నం జరిగింది. తన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో మద్దతు దారులు వచ్చారు. వాళ్లను కలుసుకునేందుకు ఆమె బయటకు వచ్చిన సమయంలో...అనూహ్య ఘటన జరిగింది. ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి సడెన్‌గా వచ్చి ఆమె నుదుటిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ట్రిగ్గర్ నొక్కినా అది పని చేయకపోవటం వల్ల వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఒకవేళ ఆ తుపాకీ పేలి ఉంటే...ఆమె అక్కడికక్కడే మృతి చెందే వారు. లక్కీగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. దుండగుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గన్‌లో మొత్తం 5 బులెట్స్ లోడ్ అయి ఉన్నట్టు అధ్యక్షుడు ఫెర్నాండెజ్ గుర్తించారు. ఆ గన్‌పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇటీవల వైస్ ప్రెసిడెంట్ క్రిస్టినాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే...ఈ ఆరోపణలు ఆమె కొట్టి పారేస్తున్నారు. అయినా...నిరసనలు మాత్రం ఆగటంలేదు.
గత వారం కొందరు నిరసనకారులు ఆమె ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రస్తుతానికి...ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఆమెను వ్యతిరేకిస్తున్న వాళ్లెందరున్నారో...మద్దతు తెలుపుతున్న వాళ్లూ అంత మందే ఉన్నారు. విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన క్రిస్టినా...సాయంకాలానికి తన ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె ఇంటి వద్ద భారీ సంఖ్యలో మద్దతుదారులు గుమి గూడారు. వాళ్లను పలకరిస్తున్న సమయంలోనే ఆమెపై హత్యాయత్నం జరిగింది. చివరి క్షణంలో గన్ జామ్ అవటం వల్ల ఆమె ప్రాణాలతో బయట పడ్డారు. అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది...హత్యాయత్నం చేసిన వ్యక్తి బ్రెజిల్ వాసి అని అనుమానిస్తున్నారు. ఆమెను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.
Also Read: సూర్యుడు అస్తమించకుండా ప్రయత్నాలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు!
Also Read: స్మార్ట్ ఫోన్ అతిగా చూస్తున్నారా? జాగ్రత్త, త్వరగా ముసలోళ్ళు అయిపోతారు, ఎందుకంటే..