Testosterone in men: యూపీలో ఇటీవల ఓ ఘోరమైన హత్య జరిగింది. నేవీలో పని చేసే వ్యక్తిని అతని భార్య, ప్రియుడితో కలిసి చంపేసింది. ముక్కలు చేసి డ్రమ్ములో పోసి కాంక్రీట్ పోసింది. తర్వాత ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి విహారయాత్రకు వెళ్లారు. తర్వాత దొరికిపోయారు. అయితే ఈ అంశంపై ఓ నెటిజన్ స్పందించారు. పెళ్లి చేసుకునే ముందు టెస్టోస్టిరాన్ టెస్టు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఆ అకౌంట్ మహిళ పేరుతో ఉండటంతో ఈ కామెంట్ విస్తృతంగా వైరల్ అవుతోంది.
అయితే ఆ నెటిజన్ ఆ తర్వాత ఆ కామెంట్ ను డిలీట్ చేశారు. కానీ నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్స్ తీసుకుని చర్చిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలుగు డాక్టర్ ఒకరు.. ఈ టెస్టోస్టిరాన్ .. గురించి పూర్తి వివరాలతో ఓ పోస్టు పెట్టారు.
అయితే ఈ అంశంపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. టెస్టోస్టిరాన్ సర్టిఫికెట్ ఇక ముందు పెళ్లిళ్లలో తప్పని సరి అవుతుందన్న సెటైర్లు వేస్తున్నారు. .
ఈ పోస్టు వైరల్ కావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని.. ఎంతో మందికి చాలా విషయాలపై అవగాహన వస్తుందని కొంత మంది అంటున్నారు.
కొంత మంది ప్రాబ్లం టెస్టోస్టిరాన్ లో ఉండదని..కేవలం బుద్దిలోనే ఉంటుందని కౌంటర్ ఇస్తున్నారు.
ఇటీవలి కాలంలో వివాహేతర బంధాల కారణంగా కుటుంబాల్లో ఏర్పడుతున్న రగడ.. జరుగుతున్న నేరాల కారణంగా కూడా ఇప్పుడు టెస్టోస్టిరాన్ పై ఎక్కువ చర్చ జరుగుతోందని అనుకోవచ్చు. రెండు వైపులా ఎవరి వాదన వారు వినిపించేవారు ఉన్నారు.