Allu Arjun: పాన్ వరల్డ్ రేంజ్‌లో బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - భారతదేశమే ఆశ్చర్యపోతుందన్న నిర్మాత నాగవంశీ

Naga Vamsi: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఇది ఎవరూ ఊహించని స్టోరీ అని.. పాన్ వరల్డ్ స్థాయిలో ఎవరికీ తెలియని ఓ గాడ్ కథ ఆధారమని చెప్పారు.

Continues below advertisement

Producer Naga Vamsi About Allu Arjun Trivikram Mythological Project: 'పుష్ప 2' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో (Trivikram Srinivas) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఓ మైథలాజికల్ స్టోరీ అని ఇప్పటివరకూ ఎవరూ చూడని రేంజ్‌లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇదివరకే చెప్పారు. తాజాగా ఈ సినిమాపై మరోసారి ఆయన అదిరే అప్ డేట్ ఇచ్చారు.

Continues below advertisement

ఎవరూ ఊహించని స్టోరీ..

'సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి మైథలాజికల్ మూవీస్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఎందుకు ఆ జోనర్‌లో మూవీస్ తగ్గాయి' అన్న ప్రశ్నకు నాగవంశీ (Naga Vamsi) సమాధానమిచ్చారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మైథలాజికల్ మూవీస్ తీయడం ఎందుకు తగ్గిపోయిందో తనకు తెలియదని.. కానీ తాము అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో కలిసి ఓ మైథలాజికల్ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్పారు. 'ఈ మూవీ చూసి భారతదేశం ఆశ్చర్యపడుతుంది.

రామాయణం, మహాభారతం వంటి ప్రసిద్ధ ఇతిహాసాల మీద కాకుండా.. ఎవరికీ తెలియని మైథలాజికల్ కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది. పురాణాల్లో ఎవ్వరికీ తెలియని ఓ గాడ్ కథ. ఆ గాడ్ పేరు విన్నా ఆయన వెనుక ఉన్న కథ ఎవరికీ తెలియదు. దాని ఆధారంగానే మేము సినిమాను రూపొందిస్తున్నాం.' అని నాగవంశీ తెలిపారు.

Also Read: ఓటీటీలో కామెడీ ఎంటర్‌టైనర్ - ఈ ఉగాదికి 'మజాకా' చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?

బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.  ఈ క్రమంలో వీరి కాంబోలో వస్తోన్న సోషియో మైథలాజికల్ ఫాంటసీ 'AA22' ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సమ్మర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

మరోవైపు, ఈ మూవీ కథ ఇంకా పూర్తి కాలేదని.. త్రివిక్రమ్ ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడని ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే అట్లీతో బన్నీ ముందుకు వెళ్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ స్క్రిప్ట్ ఓకే అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంటే ముందే ఈ మూవీ స్టార్ట్ అవుతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. నాగవంశీ తాజా కామెంట్స్‌తో బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ నెలకొంది. 

Continues below advertisement