Romans Hidden Empire: స్పెయిన్‌లో ఇన్నాళ్లు వెలుగు చూడని ఓ భారీ సామ్రాజ్యం బయట పడింది. పురావస్తు తవ్వకాల్లో ఈ "Hidden Empire" వెలుగు చూసింది. University of Cádiz కి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ సామ్రాజ్యాన్ని కనుగొంది. ఇది రోమన్ల రాజ్యం అని గుర్తించారు. అయితే...అనుకోకుండా ఇది బయటపడిందని వెల్లడించారు. క్యాడిజ్ ప్రాంతంలో 57 చోట్ల రోమన్ చక్రవర్తులు పరిపాలించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. వస్తువుల కోసం తవ్వకాలు చేపడితే ఏకంగా ఓ సామ్రాజ్యమే బయట పడడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. రేడార్ టెక్నాలజీ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలిగారు. అయితే...ఈ 57 ప్రాంతాలకూ ఏదో ఓ చోట కనెక్షన్ ఉందని గుర్తించారు. అప్పట్లో వ్యాపారం సాగించేందుకు ఈ దారులను ఉపయోగించినట్టు భావిస్తున్నారు. గ్వాడలీట్ నది (Guadalete River) పరీవాహక ప్రాంతంలోనే ఈ సామ్రాజ్యం నిర్మించారు. గ్వాడలీట్ నదీ లోయలో రోమన్లు ఉన్నారనడానికి ఈ ఆధారాలే నిదర్శనమని ఆర్కియాలజిస్ట్‌లు చెబుతున్నారు.
అంతే కాదు. 2 వేల ఏళ్ల క్రితం నాటి ఈ సామ్రాజ్యం గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. మల్టీస్పెక్ట్రాల్ కెమెరాలతో పాటు లిడార్ టెక్నాలజీ ద్వారా పదుల సంఖ్యలో రోమన్ చక్రవర్తులు ప్రాంతాలు పరిపాలించిన ప్రాంతాలను గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఆర్కియాలజిస్టులు లిడార్ టెక్నాలజీతో ఇలాంటి ఎన్నో చారిత్రక ఆధారాలను వెలికి తీశారు. భూగర్భంలో ఎక్కడో అడుగున్న ఉన్న వస్తువులనూ ఈ రేడార్ గుర్తిస్తుంది. ఆ విధంగానే ఈ రోమన్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. 2023లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో రోమన్‌ల ఆధారాలు దొరకడం ఇదే తొలిసారి కావడం వల్ల ఆర్కియాలజిస్ట్‌లు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేపడుతున్నారు.