Ram Charan in Melbourne Airport: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (Indian Film Festival Of Melbourne) వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి చరణ్‌కు వరుసగా అరుదైన ఘనత, గౌరవం అందుకుంటున్నారు. ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
ఇప్పుడు ఏకంగా మెల్‌బోర్న్‌లో జరుగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో(IFFM) ముఖ్య అతిథిగా పాల్గోనబోతుండటం విశేషం. ఈ సందర్భంగా భార్య, కూతుర క్లింకారతో కలిసి చరణ్ మెల్‌బోర్న్ వెళ్లాడు. అక్కడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చరణ్‌ను చూసేందుకు ఇండియన్ ఫ్యాన్స్ అంతా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా చరణ్ కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ మల్‌బోర్న్ 15వ ఎడిషన్ వేడుకలు మొదలయ్యాయి.
ఈ కార్యక్రమానికి రామ్ చరణ్‌కు గౌరవ అతిథి పాల్గొనేందుకు ఆయన ఆహ్వానం అందింది. అంతేకాదు ఈ కార్యక్రమంలో ఆయన అవార్డులో కూడా అందుకోనున్నారు. ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అంబాసిడర్ చరణ్ ఈ అవార్డును తీసుకోబోతుండటం విశేషం. భారత చలన చిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గానూ రామ్ చరణ్‌కు ఈ అవార్డును. ఇక ఈ అవార్డుకు ఎన్నికైన మొదటి ఇండియన్ సెలబ్రిటీగా చరణ్ మర అరుదైన రికార్డును తన ఖాతా వేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి పాల్గొనడంపై ప్రకటన రాగానే చరణ్ సోషల్ మీడియాలో వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.
"భారతీయ సినిమా గొప్పతనాన్ని, వైవిధ్యం అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. అలాగే భారత సినీ పరిశ్రమ తరపున నేను ప్రాతినిధ్యం వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను, సినీ ప్రముఖులను కలుసుకునే అవకాశం రావడం నా అదృష్టం. RRR సినిమా అంతర్జాతీయం అయ్యింది. అలాంటి సినిమా గొప్ప అనుభూతిని మెల్‌బోర్న్ ప్రేక్షకులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన జాతీయ జెండాని మెల్‌బోర్న్‌లో ఎగురవేసే గొప్ప అనుభూతి కోసం ఎదురుచూస్తున్నానుజ" అంటూ తన ట్వీట్ పేర్కొన్నారు.