Araku Coffee Nanolot series: ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీలోని గిరిజన రైతులు పండించిన అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ స్థాయి స్పెషాలిటీ బ్రాండ్‌గా మారింది. నాంది ఫౌండేషన్ మద్దతుతో 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రయత్నం ఇటీవల కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. 'నానోలాట్ సిరీస్' లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణతో సూపర్ బ్రాండ్ గా మారింది. అరకు కాఫీ బ్రాండ్ సీఈఓ మనోజ్ కుమార్, నాంది ఫౌండేషన్ సీఈఓ కూడా అయిన ఆయన నక్సల్ ప్రభావిత ప్రాంతంలోని గిరిజనులు ఇప్పుడు లగ్జరీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ను సృష్టిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆనంద్ మహింద్రా కూడా స్పందించారు.
నానోలాట్ కాఫీకి ప్రత్యేకత ఉంది. ఒకే ప్లాట్‌లో ఒకే రైతు పండించిన కాఫీని మైక్రో బ్యాచ్‌లలో ప్రాసెస్ చేసి, రోస్ట్ చేస్తారు. ధర కిలో రూ.10,000.. విదేశాల్లో ఎక్కువగా అమ్ముతారు. అందుకే డాలర్లలో సుమారు $100). ఇది భారతీయ అరబికా కాఫీకి ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదన్నంత ఉన్నత ధర. మొదటి రిలీజ్ రెండు వారాల క్రితం ఆన్‌లైన్‌లో 24 గంటల్లోనే అమ్ముడుపోయింది. రెండో రిలీజ్ గత వారం కేవలం 2 గంటల్లోనే అమ్ముడుపోయింది. 2025 సిరీస్‌లో అంతర్జాతీయ కప్పింగ్ జ్యూరీ ఎంపిక చేసిన 5 అత్యున్నత స్కోర్ లాట్‌లు ఉన్నాయి. గ్లోబల్ కాఫీ ఎక్స్‌పర్ట్ షెర్రీ జాన్స్ మార్గదర్శకత్వంలో ఇవి సింగిల్ ప్లాట్‌ల నుంచి వచ్చాయి.
ఉదాహరణకు, టంగుల రాజు, వరలక్ష్మి దంపతులు తమ 2 ఎకరాల ఫారమ్‌లో పండించిన 540 కేజీల్లో 25 కేజీలు నానోలాట్‌గా మారాయి. 25 ఏళ్లుగా నాంది ఫౌండేషన్ అరకు వ్యాలీలోని సబ్‌సిస్టెన్స్ రైతుల జీవితాలను మార్చడానికి కృషి చేస్తోంది. రీజెనరేటివ్ ఫార్మింగ్ ఇన్‌పుట్స్, బెస్ట్ ప్రాక్టిసెస్ అందించి, సస్టైనబుల్ కమ్యూనిటీని నిర్మించారు. అరకులో కాఫీకి టెర్రాయర్ అప్రోచ్‌ను ప్రపంచంలో మొదటిసారిగా నాంది అన్వయించింది. ఇది సాంప్రదాయకంగా వైన్ తయారీలో ఉపయోగించే పద్ధతి. 1 లక్ష మంది రైతులు పండించిన కాఫీలో ఎక్కువ భాగం అంతర్జాతీయ కప్పింగ్‌లో 85+ స్కోర్ సాధిస్తోంది. కొన్ని లాట్‌లు మరింత ఉన్నతంగా ఉండటంతో నానోలాట్‌లు రూపొందాయి. అరకు కాఫీ బ్రాండ్ పారిస్‌లో 2017లో మొదటి స్టోర్ ప్రారంభమైంది. ఇప్పుడు బెంగళూరు, ముంబైలో కేఫ్‌లు ఉన్నాయి.
గతంలో స్థానిక మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముకునే కాఫీ ఇప్పుడు ప్రపంచ స్థాయి లగ్జరీ ప్రొడక్ట్‌గా మారింది. నాంది ఫౌండేషన్ బృందం, మనోజ్ కుమార్ నాయకత్వం ఈ విజయానికి కీలకం. రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ 'ఫుడ్ సిస్టమ్ విజన్ 2050' ప్రైజ్‌తో సహా అనేక అవార్డులు దక్కాయి. అరకు కాఫీ ఇప్పుడు భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోంది. నానోలాట్ సిరీస్ విజయం గిరిజన రైతుల కష్టానికి, నాంది దూరదృష్టికి నిదర్శనం. ఈ బ్రాండ్ మరిన్ని మైలురాళ్లు చేరుస్తుందన్న నమ్మకం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఉంది.