ఈ ఏడాది (2025) సౌత్ సినిమా నుంచి అనేక సినిమాలు వెండితెరపై విడుదల అయ్యాయి. వాటిలో చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే బాక్సాఫీస్‌లో అద్భుతమైన వసూళ్ళు సాధించాయి. సౌత్ సినిమా ఒకటి అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డును సృష్టించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు ఏవో తెలుసుకోండి.

Continues below advertisement

రూ. 850 కోట్లతో 'కాంతార: చాప్టర్ 1''కాంతార: చాప్టర్ 1' సౌత్ ఇండియన్ సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా కూడా నటించారు. సుమారు 130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 850 కోట్ల రూపాయలు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

Continues below advertisement

రూ 517 కోట్లతో రజనీకాంత్ 'కూలీ'2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన 'కూలీ' కూడా ఉంది. ఈ సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర 517 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

డివోషనల్ హిట్ 'మహాఅవతార్ నరసింహ'యానిమేటెడ్ ఫిల్మ్‌ 'మహాఅవతార్ నరసింహ' కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఈ మూవీ కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్‌లో నిర్మించారు. కానీ బాక్సాఫీస్‌లో 325 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, ఆ సంవత్సరం అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది.

మలయాళ హిట్ 'లోక చాప్టర్ 1'కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1'. ఇది కూడా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దాంతో బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు సాధించింది. 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా (సుమారు 3 బిలియన్ డాలర్లు) వసూలు చేసి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్... 'ఓజీ'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'దే కాల్ హిమ్ ఓజీ'. ఇది కూడా హిట్ సినిమాల జాబితాలో చేరింది. 240 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సుమారు 298 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి.

మోహన్ లాల్ 'ఎల్2 ఎంపురాన్' కూడా!మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎల్2: ఎంపురాన్'. దీనికి పృథ్వీరాజ్ దర్శకుడు. ఈ చిత్రం కూడా అంచనాలను అందుకుని అద్భుతమైన విజయం సాధించింది. 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 268 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 'ఎల్2 ఎంపురాన్' రికార్డులను బద్దలు కొట్టి గొప్ప విజయాన్ని సాధించింది.

విజయాలు సాధించిన ఇతర సౌత్ సినిమాలువెంకటేష్ ' సంక్రాంతికి వస్తున్నాం', అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలు కూడా బాగా చర్చనీయాంశమయ్యాయి. వీటితో పాటు కన్నడ సినిమా 'సు ఫ్రమ్ సో' కూడా హిట్ అయింది. ఇది కేవలం 4.5-6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 125 కోట్ల రూపాయలు వసూలు చేసింది.