AI In Women Undressing: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలు చేసే వారు కొందరు అయితే, దానిని దుర్వినియోగం చేసేవారు మరికొందరు. టెక్నాలజీతో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుందని చెప్పొచ్చు. తాజా టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కొందరు తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారు. మహిళలను వివస్త్రలు (Women Undressing)గా చూపించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటువంటి యాప్‌లు (Undressing Apps) , వెబ్‌సైట్ (Undressing Websites)లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
సెప్టెంబరులోనే, 24 మిలియన్ల మంది మహిళలను వివస్త్రలు, న్యూడ్‌గా చూపించే వెబ్‌సైట్‌లను సందర్శించారని సోషల్ నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థ గ్రాఫికా సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ సంస్థ వివరాల ప్రకారం.. ‘న్యూడిఫై’ సేవల మార్కెటింగ్ కోసం ప్రముఖ సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సోషల్ మీడియా X (ట్విటర్), రెడిట్, ఇతర సోషల్ మీడియాలో అన్‌డ్రెస్సింగ్ యాప్‌ల ప్రకటనల సంఖ్య 2,400 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు.
ఈ యాప్‌లు అన్నీ ఒక వ్యక్తి నగ్నంగా ఉండే చిత్రాన్ని తయారుచేసేందుకు AIని ఉపయోగిస్తాయి. వీటిలో చాలా వరకు మహిళలను న్యూడ్‌గా చూపించేందుకు మాత్రమే పనిచేస్తాయి. కృత్రిమ మేధస్సులో అశ్లీల చిత్రాలను రూపొందిండం భవిష్యత్తులో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంటుందనే ఆందోళన ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే చిత్రాలు, వీడియోలను తీసుకుని ఇప్పటికే డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీకి పాల్పడుతున్నారు.
గతంలో ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతమైన చిత్రాలను సృష్టించగలవని గ్రాఫికా పేర్కొంది. AIలు ఓపెన్ సోర్స్ అవడం వల్ల, యాప్ డెవలపర్‌లు వాటిని ఉపయోగించుకుని డీప్ ఫేక్‌కు పాల్పడుతున్నారు. మునుపటి డీప్‌ఫేక్‌లు అస్పష్టంగా ఉండేవని, ప్రస్తుతం దేనినైన నిజం అనిపించేలా వాస్తవికంగా తయారు చేయొచ్చని గ్రాఫికా సంస్థ విశ్లేషకుడు శాంటియాగో లకాటోస్ తెలిపారు.
సోషల్ మీడియాలో Xలో విప్పే యాప్ ఫొటోలను పోస్ట్ చేసి నగ్న చిత్రాలను సృష్టించవచ్చనే ప్రకటనలను యాప్‌లు ఇస్తున్నాయి. అదే సమయంలో గూగుల్, యూట్యూబ్‌లో వాటికి సంబంధించిన పదం వెతికితే వెంటనే ఆ యాప్ కనిపించేలా ప్రచారం చేస్తున్నారు. అయితే లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను కలిగి ఉంటే ప్రకటనలను కంపెనీ అనుమతించదని గూగుల్ ప్రతినిధి తెలిపారు. సందేహాస్పద ప్రకటనలను సమీక్షిస్తామని, తమ నిబంధనలు ఉల్లంఘించే వాటిని తీసివేస్తున్నట్లు వెల్లడించారు. ఒక రెడిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. లైంగిక, అసభ్యకరమైన విషయాలను సైట్ నిషేధిస్తుందని, ఇప్పటికే అనేక డొమైన్‌లను నిషేధించిందని తెలిపారు. అయితే దీనిపై X (ట్విటర్) ప్రతి స్పందించలేదు.
ట్రాఫిక్ పెరుగుదలతో పాటు, కొన్ని సేవలు, నెలకు $9.99 వసూలు చేస్తాయని, తద్వారా వారు చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తూ వ్యాపారం చేస్తున్నారని లకాటోస్ చెప్పారు. ప్రముఖుల డీప్ ఫేక్, నకిలీ అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో చాలా కాలంగా ఉంటున్నాయి. తాజా AI సాంకేతికత డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్‌ను సులభతరం, ప్రభావవంతం చేసిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ లక్ష్యాలతో సాధారణ వ్యక్తులు దీన్ని ఎక్కువగా చేయడం చూస్తున్నామని, భవిష్యత్తులో హైస్కూల్ పిల్లలు, కళాశాలలో ఉన్నవారిలో దీని ప్రభావాన్ని చూస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ నిషేధించే ఫెడరల్ చట్టం ప్రస్తుతం ఏదీ లేదు. కానీ మైనర్ల చిత్రాలపై నిషేధం విధించింది. నవంబర్‌లో నార్త్ కరోలినాలో పిల్లల డీప్ ఫేక్ ఫొటోలు తయారు చేసిన మానసిన వైద్యుడికి 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, డీప్‌ఫేక్ సృష్టించడం నిషేధించే చట్టం ప్రకారం ఇది తొలి కేసు. టిక్‌టాక్ ‘అన్‌డ్రెస్’ అనే కీవర్డ్‌ని బ్లాక్ చేసింది. ఎవరైనా ఈ పదం కోసం ఎవరైనా వెతుకుతున్నప్పుడు వార్నింగ్ మెస్సేజ్ ఇస్తుంది. అలాగే మెటా సైతం బట్టలు విప్పే యాప్‌లను వెతికేందుకు ఉపయోగించే కీలక పదాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది.