Astrology:  నాలుగు నెలల చలికాలంలో కనీసం రెండు నెలలైనా చలి గట్టిగానే ఉంటుంది. నిద్రలేవాలంటే బద్ధకం, సూరీడు నడినెత్తిమీదకొచ్చినా ఇల్లు కదలాలంటే వణుకు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదై బెంబేలెత్తించేస్తుంటాయ్. అమ్మో చలి..ఈ సీజన్ చాలా చికాకు అనుకునేవారు కొందరైతే.. ఎంజాయ్ చేసేవారు మరికొందరు. ఇది కూడా మీ రాశులపై ఆధారపడి ఉంటుందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇంతకీ చలికాలాన్ని ఎంజాయ్ చేసే రాశులేంటంటే...


Also Read: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
 
ఈ రాశి వారికి చలికాలం అంటే చాలా ఇష్టం. వృషభరాశివారు ఎప్పుడూ చల్లటి వాతావరణాన్ని కోరుకుంటారు. అన్ని సీజన్స్ కన్నా కూల్ వెదర్ సౌకర్యంగా ఉంటుందని భావిస్తారట. చల్లటి గాలులు వీస్తుంటే వెచ్చగా ముసుగేసుకుని కునుకేయడం వీరికి భలే ఇష్టం. వాతావరణాన్ని బట్టి కూడా వీరి తీరు మారుతుందని...ఈ సీజన్లో వీరికి కోపం తక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో కూల్ కూల్ గా రిలాక్స్ గా కనిపిస్తారు.


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


కర్కాటక రాశి వారు శీతాకాలాన్ని బాగా ఆస్వాదిస్తారు. ఈ సీజన్లో బయటకు తిరిగే కన్నా ఇంట్లోనే ఉండి వేడి వేడి వంటకాలు ఆస్వాదించాలనుకుంటారు.  చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లేకన్నా ఏకాంత సమయాన్ని స్పెండ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. 


Also Read: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!


కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


శీతాకాలాన్ని ఆస్వాదించే రాశుల్లో కన్యా కూడా ఉంది. అయితే  వీరు రొటీన్ కి భిన్నంగా చల్ల చల్లని గాలుల్లో ఇంట్లోనే ఉండిపోవాలని అనుకోరు...బయట ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. భాగస్వామితో కాదండోయ్... స్నేహితులతో ఎంజాయ్ చేయాలనుకుంటారు.  చల్లటి గాలుల్లో గాల్లో తేలినట్టుందే అన్నట్టు ఫీలవుతారు


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)


వృశ్చిక రాశివారికి కూడా వింటర్ సీజన్ అంటే ఇష్టం. ఈ సీజన్ ని చాలా కంఫర్ట్ గా ఫీలవుతారు.  అయితే చలికాలంలో ఇల్లు కదలాలంటే మహా బద్ధకంగా ఉంటారు..అడుగు బయట పెట్టేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఈ సీజన్లో ఎక్కువ మెమొరీస్ కూడబెట్టుకునే పనిలో ఉంటారు. కేవలం చలికాలంలోనే వ్యక్తిగత జీవితం ఆనందంగా , ఆహ్లాదంగా ఉంటుందని భావిస్తారు.


Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


మకరరాశివారికి శీతాకాలం అంటే చాలా ఇష్టం.  వీరు అందరిలా కాకుండా లైఫ్ లో మరో అడుగు ముందుకేసే ఆలోచనలు ఎక్కువగా ఈ సీజన్లోనే తీసుకుంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు.  చల్లటి గాలుల్లో వీరి మైండ్ ఫ్రెష్ గా పనిచేస్తుంది..ఫ్యూచర్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు...


గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…