Apple Watch Series 10 Launched: ఆపిల్ నిర్వహించిన మెగా ఈవెంట్‌లో వాచ్ 10 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వాచ్ 10 సిరీస్ డిజైన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడేలా డిజైన్ చేశారు. డిజైన్‌ మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే చాలా ఫీచర్స్‌ను ఈ 10 సిరీస్‌లో ఆపిల్‌ కంపెనీ జోడించింది. ముఖ్యంగా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు మైండ్‌ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ఆపిల్ వాచ్ 10 సిరీస్‌లో మొదట చెప్పుకోదగ్గ ఫీచర్‌ బ్యాటరీ. ఇది చాలా కాలం వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెబుతోంది ఆపి కంపెనీ. ఇప్పటి వరకు ఏ వాచ్‌లకు రానట్టుగా ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని పేర్కొంది. 


ఆపిల్ వాచ్ 10 సిరీస్‌ను టిమ్ కుక్ ప్రకటించారు. ఈ టెన్త్ సిరీస్ ఆపిల్ వాచ్‌ అతిపెద్ద డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంత మాత్రాన పెద్దగా కూడా కనిపించదు. సన్నగా నాజూకుగా డిజైన్ చేశారని చెప్పవచ్చు. ఈ ఉత్పత్తి గురించి COO జెఫ్ విలియమ్స్ వివరిస్తూ ... Apple Watch Ultra కంటే సిరీస్ 10 పెద్ద డిస్‌ప్లేనుకలిగి ఉందని తెలియజేశారు. పెద్ద స్క్రీన్ టెక్స్ట్, వార్తలు, ఇతర సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు ఈజీగా చదువుకోవచ్చని అంటున్నారు. డిస్‌ప్లేతోపాటు కేస్ కూడా అదే రేషియోలో కనిపిస్తోంది. 


ఆపిల్ వాచ్ 10 సిరీస్ స్పెసిఫికేషన్స్‌
Apple వాచ్ 10 సిరీస్ ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా కరెన్సీ ప్రకారం 33వేల వరకు ఉంటుంది. దీని అమ్మకాలు కూడా తక్షణం ప్రారంభిస్తున్నటు ఆపిల్ సంస్థ ప్రకటించింది. దీన్ని సెప్టెంబర్ 20 నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. 


తొలిసారిగా ఈ వాచ్‌లో వైడ్ యాంగిల్ OLED డిస్‌ప్లే అందుబాటులోకి తీసుకొచ్చారు. సిరీస్ 10 డిస్‌ప్లే ఏ యాంగిల్‌లో చూసినా సరే మనకు ఒకేలా కనిపిస్తుంది. కేసు మన్నికైన అల్యూమినియం మిశ్రమంతో తయారు చేశారు. దీని స్పీకర్లు కూడా అద్భుతమైనవిగా చెబుతోంది కంపెనీ. ఇందులో ఇచ్చిన స్పీకర్ల ద్వారా మ్యూజిక్ వినడమే కాకుండా మంచి క్వాలిటీ మీడియాలు కూడా ప్లే చేసుకోవచ్చు. 


ఈ వాచ్ సిరీస్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం 30 నిమిషాలపాటు ఛార్జింగ్ చేస్తే 80 శాతం ఛార్జింగ్ అయిపోతుంది. ఇది నలుపు, సిల్వర్, గోల్డెన్ రోజ్‌ రంగులలో విడుదల చేశారు. యాపిల్ వాచ్ సిరీస్ 10 ఇప్పుడు కొత్త పాలిష్ టైటానియం ఫినిషింగ్‌తో వస్తుంది. దీని వల్ల వాచ్ సన్నగా ఉండటమే కాకుండా తేలికగా ఉంటుందని యాపిల్ చెబుతోంది.


Also Read: అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అయిన iPhone 16 Pro- బిగ్‌ స్క్రీన్, స్పెషల్ కెమెరా ఫీచర్స్‌ ఉన్న ఈ ఫోన్ ధర ఎంతంటే?


Apple వాచ్ 10 సిరీస్‌లో OS 10 పిక్స్ యాప్‌, ట్రాన్స్‌ లేషన్ యాప్‌తో సహా అనేక కొత్త ఫీచర్‌లు పరిచయం చేసింది. సిరీస్ 10 ఆపిల్ వాచ్ కొత్త S10 చిప్‌తో పని చేస్తుంది. ఇది నాలుగు-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో వస్తుంది. డైలీ మీకు అనేక రకాలుగా ఉపయోగపడే మరెన్నో ఫీచర్స్‌ను ఇందులో పొందుపరిచారు. 


సిరీస్ 10 ప్రత్యేక లక్షణాల్లో ఒకటి స్లీప్ అప్నియాను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. 80% స్లీప్ అప్నియా కేసులు నిర్ధారణ కాకపోవడంతో నిద్రలో శ్వాసకోశ రుగ్మతల పర్యవేక్షించే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను ఆపిల్ తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లను అలర్ట్ చేస్తుంది. ముందస్తుగానే వారికి విషయాన్ని చేరవేస్తుంది. ఈ వాచ్‌ 18 గంటల బ్యాటరీ బ్యాకప్‌ కలిగి ఉంది. 


ధర ఎంత
ఆపిల్ వాచ్ సిరీస్ 10 GPS మోడల్‌ను USలో 399 డాలర్లకు అమ్ముతోంది. కంపెనీ తన GPS + సెల్యులార్ మోడల్ ధరను 499 డాలర్లుగా నిర్దారించింది. 


Also Read: ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్ ఫీచర్‌తో వచ్చిన కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ధర మామూలుగా లేదు!