Mahakumbh 2025 : దేవతల కాలంలో అమృతం కోసం సముద్ర మథనం జరిపారని చాలా కథల్లో విన్నాము. అమృతం దొరికింది కానీ దానిని పొందడానికి రాక్షకులు, దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. రెండు వేర్వేరు సంస్కృతులు, ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒక పెద్ద లక్ష్యం కోసం కలిసి రావడం ఇదే మొదటిసారి. వారి ఇద్దరి లక్ష్యం ఒక్కటే అమృతాన్ని దక్కించుకోవడం. దాని కోసమే గొడవ జరిగింది. ఈ యుద్ధంలో అమృత కలశం నుంచి చాలాసార్లు ఒలికి పోయి వివిధ ప్రదేశాల్లో పడిపోయింది.
మహా కుంభమేళా అంటే ఏమిటి?జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 13న మొదటి షాహిస్నానం జరుగుతుంది. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని పూర్తిగా అలంకరించారు. లక్షలాది మంది సాధువులు మహా కుంభమేళాకు వస్తున్నారు. అమృతం కోసం జరిగే ఈ అన్వేషణ భారతీయులను ఒకే చోటికి తీసుకువస్తుంది. పవిత్ర నదుల ప్రవహించే నీటి ముందు, ప్రతి ఒక్కరి, విభిన్న గుర్తింపులు దాగిపోతాయి, వారు కేవలం మనుషులుగానే మిగిలిపోతారు. గంగలో మునిగితే చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం.
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళాఈసారి మహా కుంభమేళా-2025 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. కుంభమేళాలను నిర్వహించడం అనేది భారతదేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలలో జరిగే పురాతన సంప్రదాయం. అసలు ఇంత పెద్ద మహోత్సవానికి ఇన్ని రోజులు ఎలా నిర్ణయించారని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాగే, కుంభమేళా ఏ ప్రదేశంలో జరుగుతుందో మనకు ఎలా తెలుస్తుంది. ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారు? అనేది చూద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఖగోళ శాస్త్రం. కుంభమేళా ఎక్కడ నిర్వహించబడుతుంది? ఈ నిర్ణయం ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, మత విశ్వాసాల ఆధారంగా తీసుకుంటున్నారు. కుంభమేళాలు 4 ప్రదేశాల్లో జరుగుతాయి.
Also Read : Mahakumbh 2025: మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా - బస్సులు, రైళ్లు, విమాన ఏర్పాట్లపై పూర్తి వివరాలివే!
* ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)* హరిద్వార్ (ఉత్తరాఖండ్)* ఉజ్జయిని (మధ్యప్రదేశ్)* నాసిక్ (మహారాష్ట్ర)
స్థానం ఎలా నిర్ణయిస్తారు ?కుంభమేళా జరిగే ప్రదేశాన్ని నిర్ణయించడంలో సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహాల స్థానం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సూర్యుడు, చంద్రుడు మకరరాశిలో బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. అయితే, సూర్యుడు మేషరాశిలో బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు, హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. దీంతో పాటు, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు.. బృహస్పతి గ్రహం కూడా సింహరాశిలో ఉన్నప్పుడు, కుంభమేళా ఉజ్జయినిలో జరుగుతుంది. చివరగా, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, బృహస్పతి సింహరాశి లేదా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లో కుంభమేళా జరుగుతుంది.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారే ఎందుకు?కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కో ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఇది కాకుండా, అర్ధ కుంభమేళా హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌ల్లో ఆరేళ్ల వ్యవధిలో జరుగుతుంది. దేవతలు, రాక్షసులు అమృత మథనం చేసేటప్పుడు అమృత కుండ నుంచి కొన్ని అమృత చుక్కలు ఈ 4 ప్రదేశాలపై పడ్డాయని, అందువల్ల ఈ ప్రదేశాలు పవిత్రమైనవని నమ్ముతారు. ఈ కార్యక్రమం మతపరంగా మాత్రమే ముఖ్యమైనది కాదు, ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, చరిత్రను కూడా గుర్తు చేస్తుంది. కుంభమేళాను 12 సంవత్సరాల విరామంలో నిర్వహించడానికి కారణం ఖగోళ గణనలు, హిందూ జ్యోతిష శాస్త్రానికి సంబంధించినది. దీని ప్రధాన ఆధారం సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహాల స్థానం. బృహస్పతి సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరిగే ప్రదేశాన్ని నిర్ణయించడంలో ఈ గ్రహం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
Also Read : Mahakumbh 2025 : మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?