విజయనగరం : రాష్ట్రంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా రూ.92.58 లక్షలతో విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన ప్రకాశం పంతులు మహిళా పార్కు ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆధునిక వసతులు, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు తదితర సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన పార్కును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్, విజయనగరం కార్పొరేషన్ పాలక వర్గ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు.
మహిళా పార్కు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం నుంచి నిర్వహించిన ర్యాలీ విజయవంతంగా సాగింది. మంత్రి ఆర్.కె. రోజా, డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, ఎంపీ ఇతర ప్రముఖులు ముందు నడవగా వేలాది మంది మహిళలు వెనుక ర్యాలీగా సాగారు. సాంస్కతిక వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ప్రదర్శనలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ బృందాలు ప్రత్యేక వాయిద్యాలు, గరగ నృత్యాలు, థింసా నృత్యాలతో చూపరులను ఆనందింపజేశారు.
ఆనంద గజపతి ఆడిటోరియం నుంచి ప్రారంభమైన ర్యాలీ సింహాచలం మేడ, కోట జంక్షన్, మూడు లాంతర్లు జంక్షన్, గంట స్తంభం కూడలి మీదుగా ప్రకాశం పంతులు మహిళా పార్కు వరకు కోలాహలంగా సాగింది. అనంతరం అక్కడ రిబ్బన్ కత్తిరించి మంత్రి ఆర్.కె. రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ, డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, ఎంపీలతో కలిసి పార్కును ప్రారంభించారు. అనంతరం ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, పిల్లల ఆట పరికరాలను, హోం థియేటర్లను పరిశీలించారు.
ప్రాజెక్టుల రాకతో జిల్లా ఖ్యాతి మరింత పెరిగింది: మంత్రి రోజా
ఈ సందర్భంగా పార్కు ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ, అభిమానం వల్ల విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, దీని వల్ల జిల్లా ఖ్యాతి మరింత పెరిగిందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెడికల్ కాలేజీ, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇతర ప్రాజెక్టులు జిల్లాకు మణిహారంగా నిలుస్తాయని అన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
అందరి సమన్వయంతో ముందుకెళ్తున్నాం: డిప్యూటీ స్పీకర్
అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల సమన్వయంతో, సహకారాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు. విజయనగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో, గ్రామీణ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల గురించి డిప్యూటీ స్పీకర్ వివరించారు.విజయనగరం లో ప్రకాశం పార్కు 98 లక్షలతో ఆధునీకరించి మహిళా పార్కును మంత్రి అర్ కె రోజా, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి లు రిబ్బన్ కట్ చేసి ప్రార్బించారు. అంతకు ముందు నగరంలో ఆనందగజపతి ఆడిటోరియం నుంచి వేలాది మంది మహిళలతో ప్రకాశం పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి రోజా, డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి,జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు లు ,మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ర్యాలీ కోట జంక్షన్ మీదుగా మూడుకాంతర్లు,ఎంజీ రోడ్డు, గంటాస్తంబం మీదుగా ప్రకాశం పార్కు జరిగింది.అనంతరం పార్కును రాష్ట్ర మంత్రి అర్ కె రోజా రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. మంత్రి బొత్స సత్యనారాయణ 40 లక్షలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.
అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు కోసం ప్రత్యేకంగా మహిళా పార్కు ఏర్పాటు విజయనగరం లో చేయడం అభినందనీయమన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ఆర్దికంగా అభివృద్ది చేయడం కోసం కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. పార్కు లో వాకింగ్, స్విమ్మింగ్, ఓపెన్ థియేటర్ పెట్టడం ఎంతో శుభపరిణామం అన్నారు. మహిళలు మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడం కోసం,వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్కులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ స్పీకర్ కృషి అభినందనీయం అన్నారు.
విజయనగరంలో జగనన్నను అన్నా పిలిచినట్లు కోలగట్ల వీరభద్రస్వామి నీ అన్నా అన్న పిలవడం అయనకున్న అభిమానానికి నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అత్యధిక కాలం చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు మంత్రులుగా చేసిన వాళ్లు ఇటీవల సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం తాను చూసానన్నారు. అనేక ఏళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రిగా చేసినా అశోక్ గజపతిరాజు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమి చేశారని ప్రశ్నించారు. కనీసం కార్పొరేషన్ కూడా చేయలేకపోయారన్నారు. మెడికల్ కాలేజీ, విమానాశ్రయం నిర్మించారా అని వారిని ప్రశ్నించారు. మీరు ప్రారంభిస్తే విమానాశ్రయం ,మెడికల్ కాలేజీ లు ప్రారంభిస్తే ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని చిత్తశుద్ది తో మెడికల్ కాలేజీ, విమానాశ్రయం నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీ లో ఆగస్ట్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పారు అనడం తప్ప విజయనగరానికి ఏమి అభివృద్ది చేశారో చెప్పాలి అన్నారు . చంద్రబాబు,అశోక్ సిగ్గు పడాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరో సారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ మహిళలు గర్వంగా సంతోషంగా ఉన్న రోజు,రాష్ట్రంలో తొలి మహిళ పార్కు ప్రారంభం చేయడం సంతోషంగా ఉంది. వేలాది మహిళలు ర్యాలీ కి రావడం జరిగిందన్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నియోజక వర్గానికి , నగరాన్ని అన్ని రకాలగా అభివృద్ది చేయడం జరిగిందన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మెడికల్ కాలేజీ,విమానాశ్రయం నిర్మాణం ముఖ్యమంత్రి సహకారంతో మంత్రి బొత్స, జెడ్పీ చైర్మన్, ఎంపీల సహకారంతో విజయనగరం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాను అభివృద్ది చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెళ్లానా చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్లు రేవతిదేవి, శ్రావణి, కమిషనర్ శ్రీరాములు నాయుడు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.