YS Jagan ex-gratia Rs 10 Lakh over Train Accident:
అమరావతి: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం మృతుల్లో ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించనున్నారు.
విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు.. అదే లైనులో సిగ్నల్ కోసం వేచి ఉన్న విశాఖ - పలాస రైలును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లలో విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు తరలిస్తున్నారు రైలు ప్రమాదంలో బాధితులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీ హోం మంత్రి తానేతి వనిత దిగ్భ్రాంతి..కొవ్వూరు: విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇంకా వేగంగా సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, సాధ్యమైనంత త్వరగా అంబులెన్స్ లను ఘటనా స్థలానికి పంపి బాధితులను ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న నేతలు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్పీ దీపికా, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. విశాఖపట్నం- రాయ్ పూర్ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేశారు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
రైలు ప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ స్ నాగలక్ష్మి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.- బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు- బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచించారు.
రాయగడ ఎస్ ప్రెస్ రైల్ ప్రమాదం ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు.హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే0891 2746330, 08912744619ఎయిర్ టెల్81060 530518106053052బీఎస్ ఎన్ ఎల్ 85000416708500041671