Parawada Fire Accident in Anakapalli district: అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతిచెందడంపై సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం జగన్. గాయపడిన వారికి అత్యవసర వైద్యం, మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.


అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా సిటీ లారెస్ కంపనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడినికి కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. నలుగురి కార్మికులు మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.  పరవాడ లారెస్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు రాంబాబు (ఖమ్మం), రాజేష్ బాబు (గుంటూరు), రామకృష్ణ (కోటపాడు), వెంకట్రావు (చోడవరం), సతీష్ అని గుర్తించారు. 


లారెస్ట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం..
పరవాడలోని లారెస్ ఫార్మా కంపెనీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్ 3 లో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మొదట ఎంబీ6 బ్లాక్ లో రియాక్టర్ కింద రబ్బరు అంటుకుంది. నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగి  ఫార్మా కంపెనీ చాలా భాగం వ్యాపించాయి. ఈ క్రమంలో నలుగురు సజీవ దహనం కాగా, తీవ్రంగా గాయపడిన కొందర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర కాలిన గాయాలు కావడంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగతా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.


ఆయుధాలు, డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్! 
అక్రమ ఆయుధాలు తయారు చేస్తూ డీలర్ల ద్వారా అమ్మకాలు జరిపే అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ ముఠా ఆయుధాలతో పాటు డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని అభినందించి వారికి 25 వేల రూపాయల రివార్డు ప్రకటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అసాంఘీక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ఏపీ పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ వివరించారు. 


అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్... ఈ ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. బళ్లారి - అనంతపురం కేంద్రంగా  బెంగుళూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు గత కొంత కాలంగా.. నకిలీ కరెన్సీ నోట్లను, ఆయుధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని సిర్పూర్ నుండి గంజాయి, మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ కేంద్రాల నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు బర్వానీ జిల్లా ఉమర్తి గ్రామం తయారీ యూనిట్ పై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ దాడి జరిపింది.  ఆరుగురు నిందితులను (నలుగురు తయారీ దారులు, ఒక డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు ఆయుధాల సరఫరాదారుడిని) పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం వీరి వద్ద నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.