Andhra News: నారా లోకేశ్ కు సీఐడీ నోటీసులు - ఈసారి ఎందుకంటే.?

Nara Lokesh: టీడీపీ నేత లోకేశ్ కు ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈసారి రెడ్ బుక్ అంశంపై నోటీసులు జారీ చేసింది.

Continues below advertisement

AP CID Notices to Nara Lokesh on Red Book Issue: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కు ఏపీ సీఐడీ (AP CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈసారి రెడ్ బుక్ (Red Book) అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 'రెడ్ బుక్' పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నారని అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు వాట్సాప్ లో ఆయనకు నోటీసులు పంపారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్నట్లు ఆయన వారికి సమాధానం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 9కు వాయిదా వేసింది.

Continues below advertisement

అసలేంటీ రెడ్ బుక్.?

వైసీపీ హయాంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని వారందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేసుకున్నట్లు లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా చెప్పారు. అధికారంలోకి వచ్చాక జ్యుడీషియల్ విచారణ జరిపించి బాధ్యులను తప్పక శిక్షిస్తామని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్క తేల్చే పుస్తకం (రెడ్ బుక్) అంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బహిరంగ సభలో చూపించారు. చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో ఉంచారని, అందరి పేర్లు ఇందులో రాసుకున్నానని అన్నారు. ఈ రెడ్ బుక్ కాపీని ఒకటి చంద్రబాబుకు ఇస్తానని, మరొకటి తన వద్ద ఉంచుకుంటానని చెప్పారు. 2024లో అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమపై కక్షసాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. దీనిపై కొందరు అధికారులు లోకేశ్ పై ఫిర్యాదు చేశారు. 'రెడ్ బుక్' పేరుతో తమను బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం లోకేశ్ కు నోటీసులివ్వాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.

రెడ్ బుక్ పై ఏమన్నారంటే.?

అయితే, 'రెడ్ బుక్' అంశంపై లోకేశ్ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో రాస్తున్నామని, తప్పు చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.?. 'అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా.? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి. అదే చదువుతా. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నారా.? రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయో వారికెలా తెలుసు.?' అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లోనే వైసీపీ, బీసీలకు సీట్లు ఇస్తోందని విమర్శించారు. మంగళగిరిలో ఓడిపోతున్నామనే తెలిసే ఇప్పుడు బీసీలకు ఇచ్చారని, గతంలో రెండుసార్లు రెడ్డిలకు ఇచ్చారని గుర్తు చేశారు. కడప ఎంపీ స్థానం, పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని సవాల్ విసిరారు. 'చిలకలూరిపేటకు పనికి రాని మంత్రి విడదల రజనీ గుంటూరు వెస్ట్ లో ఎలా పనికొస్తారు.?. ఓ నియోజకవర్గంలో చెత్త, మరో చోట బంగారం అవుతుందా.?' అని ప్రశ్నించారు.

Also Read: Andhra News: 'హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, అవినీతిపై సినిమా తియ్యొచ్చు కదా' - ఆర్జీవీపై లోకేశ్ సెటైర్లు

Continues below advertisement