Top Equity Mutual Funds in 2023: ఈ ఏడాది స్టాక్ మార్కెట్ మ్యాజిక్ చేసింది, ఇన్వెస్టర్లకు మరిచిపోలేని మంచి అనుభవాలు మిగిల్చింది. 2023లో, ప్రధాన దేశీయ సూచీలు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ చాలా రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా, క్యాలెండర్ ఇయర్ ముగిసే చివరి రోజుల్లో, రోజుకో కొత్త శిఖరం ఎక్కుతూ తమ రికార్డులు తామే బ్రేక్ చేశాయి. గురువారం (28 డిసెంబర్ 2023) ట్రేడింగ్‌లోనూ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూడు మళ్లీ కొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. దీనివల్ల... మ్యూచువల్ ఫండ్స్‌లో, ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లు బాగా లాభపడ్డారు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే? (What are Equity Mutual Funds?)
మ్యూచువల్ ఫండ్స్‌లో (MFs) ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒక రకం. ఈ ఫండ్స్, వాటి పెట్టుబడి కేటాయింపుల్లో ఈక్విటీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాయి. ఇంకా సింపిల్‌గా చెప్పాలంటే, తమ దగ్గరున్న డబ్బులో సింహభాగాన్ని ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. వీటిలోనూ ఉప వర్గాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ELSS ఫండ్ (టాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్), కాంట్రా మ్యూచువల్ ఫండ్, వాల్యూ మ్యూచువల్ ఫండ్, ఫోకస్డ్ మ్యూచువల్ వంటివి ఉన్నాయి. ఇన్వెస్టర్ల లక్ష్యం, అవసరం, ఆలోచనలకు అనుగుణంగా వీటిలో ఒకదాన్ని ఎంచుకుని పెట్టుబడి పెట్టొచ్చు.
6 ఫండ్స్‌లో 60% కంటే ఎక్కువ రాబడి
2023లో స్టాక్ మార్కెట్ చారిత్రాత్మక ర్యాలీ చేయడంతో, ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అద్భుతమైన రాబడిని (Returns) ఇచ్చాయి. ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టిన 6 ఫండ్స్, 2023లో, తమ SIP (Systematic Investment Plan) పెట్టుబడిదార్లకు 60% తగ్గకుండా రాబడి అందించాయి. అంటే, రూ.100 పెట్టుబడికి రూ.60 తగ్గకుండా లాభం వచ్చింది.
సాధారణంగా, పెట్టుబడిదార్లు తమ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP for long-term financial goals) ద్వారా పెట్టుబడి పెడతారు. SIP ద్వారా, నిర్ణీత సమయంలో తక్కువ మొత్తాలతో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లి, దీర్ఘకాలంలో చాలా పెద్ద మొత్తంలో వెనక్కు తీసుకోవచ్చు.
SMF డేటా ప్రకారం, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు (YTD) అర డజను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ SIP ఇన్వెస్టర్లకు 60 శాతం పైగా రిటర్న్స్ ఇచ్చాయి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, తన ఇన్వెస్టర్లకు 70 శాతం పైగా లాభాలను ఇచ్చింది. డిసెంబర్ 10, 2023 వరకు ఉన్న డేటా ఇది.
2023లో, సిప్ ఇన్వెస్టర్లకు బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన 9 ఈక్విటీ ఫండ్స్ (Top Equity Mutual Funds in 2023)
బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ----- 70.06%
మహీంద్ర మ్యానులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ ----- 69.78%
ITI స్మాల్ క్యాప్ ఫండ్ ----- 65.51%
నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ----- 63.96%
ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ----- 63.05%
HSBC మల్టీ క్యాప్ ఫండ్ ----- 61.16%
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ----- 59.49%
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ----- 58.54%
JM వాల్యూ ఫండ్ ----- 58.44%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఇక్కడ నెలకు రూ.32 చెల్లిస్తే ఏడాదికి రూ.2 లక్షలు - ప్రైవేట్ కంపెనీలకు వేలకువేలు కట్టడమెందుకు?