ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలపై దృష్టి సారించాయి. ఎస్పీ, భాజపా మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందని ఇటీవల సర్వేలు వెల్లడించాయి. ఇప్పటికీ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కూడా సమాజ్‌వాదీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. యోగి ఆదిత్యనాథ్‌పై పలు ఆరోపణలు చేశారు.
యోగి ఆదిత్యానాథ్ తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రతి సాయంత్రం తన కాల్స్‌ను ఆయన వింటున్నారని ఆరోపించారు.
భయపడను..
యూపీలో భాజపాకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీకు చెందిన ముఖ్య నేతల ఇళ్లపై ఇటీవల ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం వారణాసి నుంచి మావు చేరుకుని... సహదత్ పురలోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయన పన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
భాజపా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను భాజపా ఉపయోగించుకుంటోందన్నారు. కాంగ్రెస్ మాదిరిగా భాజపా కూడా అదే దారిలో వెళ్తోందని.. కాంగ్రెస్ గత చరిత్రను చూడండి, ఎవరినైనా బెదిరించాలనుకుంటే, కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటూ ఉండేది. నేడు భాజపా కూడా అదే చేస్తోందని విమర్శించారు. రామ రాజ్యాన్ని తెస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాజపా విఫలమైందని అఖిలేష్ విమర్శించారు.
Also Read: Covid-19 Vaccination: ఆదర్శంగా అండమాన్ నికోబార్ దీవులు.. సవాళ్లను దాటి 100% వ్యాక్సినేషన్
Also Read: 144 in Kerala: కేరళ అలప్పుజలో 144 సెక్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి