Canada Prime Minister : కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త నాయకున్ని ఎన్నుకున్న తర్వాత తాను పార్టీ నేత పదవికి, ప్రధాని పదవి రెండింటికి రాజీనామా చేస్తానని చెప్పారు. కొంతకాలంగా సొంత పార్టీ నేతలే ట్రూడో వైదొలగాలంటూ చేసిన డిమాండ్ల నేపథ్యంలో తాజాగా ఆయన ఈ ప్రకటన చేశారు. జనవరి 6న ట్రూడో అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ తదుపరి నాయకుడిగా ఎవర్ని ఎన్నుకుంటున్నా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. వారిలో కొందరు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది.  వారిలో బాగా వినిపించిన పేరు అనితా ఆనంద్. 


రేసు నుంచి తప్పుకున్న అనితా ఆనంద్
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ప్రస్తుతం ప్రధాని పోటీలో లేరని తెలుస్తోంది. ఒంటారియోలోని ఓక్‌విల్లే నుండి ఎంపీగా దేశంలో తదుపరి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ట్రూడో ముందుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత తను ఈ ప్రకటన చేశారు. జస్టిన్ ట్రూడో స్థానంలో అనితా ఆనంద్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఆమె ప్రకటన తర్వాత, ఆమె రేసుకు దూరంగా ఉంది. ఆమెకు ముందు ఈ రేసులో మరో ఇద్దరు నాయకులు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు.


Also Read : Justin Trudeau : ట్రూడో రాజీనామా తరువాత కెనడా ప్రధాని పదవి రేసులో ఉన్న పోటీదారులు వీళ్లే


కెనడా ప్రధానికి కృతజ్ఞతలు
అనితా ఆనంద్ మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఒంటారియోలోని ఓక్‌విల్లే నుండి ఎంపీగా తిరిగి ఎన్నికకు పోటీ చేయబోనని ధృవీకరించారు. తన ప్రకటనలో పార్లమెంటు సభ్యునిగా లిబరల్ బృందంలోకి తనను స్వాగతించినందుకు,  ముఖ్యమైన క్యాబినెట్ మంత్రిత్వ శాఖలను ఇచ్చినందుకు పదవీ విరమణ చేసే కెనడా ప్రధాన మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత తనను హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాకు ఎన్నుకున్నందుకు ఓక్‌విల్లే ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి ఎన్నికల వరకు ఎంపీగా తన పాత్రను కొనసాగిస్తానని ఆనంద్ తన ప్రకటనలో తెలిపారు.  


అనితా ఆనంద్ కుటుంబ నేపథ్యం


తమిళ తండ్రి,  పంజాబీ తల్లికి జన్మించిన 57 ఏళ్ల అనితా ఆనంద్ ట్రూడో మంత్రివర్గంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆమె ట్రూడో మంత్రివర్గంలో చేర్చబడినప్పటి నుండి అనితా ఆనంద్ ప్రజా సేవలు, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.  2024లో తను ట్రెజరీ బోర్డు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. 2019లో రాజకీయాల్లోకి రాకముందు అనితా ఆనంద్ న్యాయవాద వృత్తిని చేపట్టి విశ్వవిద్యాలయాలలో బోధించాడు. ఆమె యేల్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ లెక్చరర్‌గా,  టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనితా ఆనంద్ తల్లిదండ్రులు   ఇద్దరూ కెనడాలో స్థిరపడిన వైద్యులు. ఆమె తాత తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.


Also Read : Three Gorges Dam in space: అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా


ప్రధానమంత్రి పదవికి పోటీలో ఉన్న నాయకులు వీరే 
ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందుకొచ్చిన తర్వాత.. నలుగురు నాయకులు క్రిస్టియా ఫ్రీలాండ్, డొమినిక్ లెబ్లాంక్, మార్క్ జోసెఫ్, మెలనీ జోలీ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ తరువాత భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ పేరు కూడా ముఖ్యాంశాలలోకి వచ్చింది. కానీ ఈ ఐదుగురు నాయకులలో మెలానీ జోలీ, డొమినిక్ లెబ్లాంక్ , అనితా ఆనంద్ ప్రధానమంత్రి పదవికి పోటీ నుండి దూరంగా ఉన్నారు.