China Plan Three Gorges Dam Project in Space: చైనా ఎవరి ఊహలకు అందడం లేదు. భూమిపై కానీ అంతరిక్షంలో కానీ పూర్తి స్థాయిలో పై చేయి సాధిస్తోంది. అసలు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తారా అనే థింక్ చేసే లోపు చైనా పక్కా ప్లానింగ్‌తో స్పేస్‌లోకి వెళ్లిపోతోంది. అలాంటి మరో మైండ్ బ్లోయింగ్ ప్లాన్‌ రెడీ చేసింది. అంతరిక్షంలో ఇప్పుడు ఏకంగా త్రీ గోర్జెస్‌ లాంటి బ్రిడ్జినే కట్టేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేసింది.  

ఇప్పటికే టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. ఇప్పుడు అంతరిక్షంలో కూడా సత్తా చాటుకోవాలని ఉబలాటపడుతోంది. అందుకే భూమిపై ఎవరూ సాధించలేని ప్రాజెక్టు కట్టిన చైనా ఇప్పుడు అంతరిక్షంలో కూడా మెగా ప్రాజెక్టుకు ప్లాన్ సిద్ధం చేసింది. 'త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రాజెక్ట్ ఇన్ స్పేస్' అని పేరుతో కొత్త ప్రాజెక్టు టేకప్ చేసింది.  

త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రాజెక్ట్ ఇన్ స్పేస్ బ్లూప్రింట్‌ను చైనా ప్రసిద్ధ రాకెట్ శాస్త్రవేత్త  లాంగ్ లెహావో రూపొందించారు. ఇప్పుడు ఉన్న త్రీ గోర్జెస్ డ్యామ్‌ను తీసుకెళ్లి అంతరిక్షంలో పెడితే ఎలా ఉంటుందో ఆ మాదిరి ప్రాజెక్ట్‌ను చేపడుతోంది. దీని కోసం భారీ కసరత్తు చేస్తోంది. టెక్నాలజీని కూడా రెడీ చేసుకుటోంది.  

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా జియోస్టేషనరీ కక్ష్యలో భారీ సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది దాదాపు కిలోమీటర్‌ కంటే ఎక్కువ వెడల్పు కలిగి ఉంటుంది. ఆ ప్యానెల్ నుంచి నిత్యం సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే సౌరశక్తిని గ్రహిస్తుంది. దీనికి రాత్రి పగలు, ఇతర వాతావరణ ప్రతికూల పరిస్థితులేవీ దీన్ని ప్రభావితం చేయలేవు.  

Also Read: యునైటెడ్ స్టేట్స్‌కు పొంచి ఉన్న ప్రమాదం - ఆయన నుంచి అమెరికాను రక్షించండి - మస్క్ ఆరోగ్యంపై రచయిత ఆందోళనలు

ఏటా 100 బిలియన్ kWh విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యామ్‌తో పోలుస్తున్నారు. యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది భూమి తిరిగే వేగంపై కూడా ప్రభావం చూపించిందని నాసా పేర్కొంది. అందుకే ఈ స్పేస్ ప్రాజెక్టు నుంచి ఏడాదికి వచ్చే విద్యుత్‌ ఉత్పత్తి... భూమిలో ఉన్న చమురు మొత్తంతో సమానమట. 

అందుకే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక సాంకేతికతను సిద్ధం చేస్తోంది చైనా. వీటిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికి కూడా సూపర్-హెవీ రాకెట్లు అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. దాదాపు 50 మీటర్ల పొడవున్న CZ-5 రాకెట్, 110 మీటర్ల వరకు చేరుకోగల CZ-9 రాకెట్లను అంతరిక్ష ఆధారిత సౌరశక్తి కేంద్రాల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

చైనా ఇప్పుడు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్టు గురించి చాలా కాలంగా శాస్త్రవేత్తల్లో చర్చ నడుస్తోంది. మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ గా పిలిచే ఈ ఆలోచనను దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు చర్చిస్తున్నారు. చైనా మాత్రం ఓ అడుగు ముందుకేసి ప్రాజెక్టు బ్లూ ప్రింట్ తయారు చేసింది. ఇదే వాస్తవ రూపం దాలిస్తే మాత్రం ఇంధన రంగంలో మరో విప్లవాత్మక నిర్ణయంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది. ఎప్పటి లోపు పూర్తి చేస్తుంది అనే వివరాలు మాత్రం చైనా చెప్పడం లేదు. 

Also Read: లాస్ ఏంజిల్స్‌లో 10వేల భవనాలు బూడిద కావడానికి కారణమేంటో తెలుసా ?